సరిలేరు నీకెవ్వరూ: సూపర్ స్టార్ కృష్ణ ప్రత్యేక పాత్రలో.. థియేటర్లలో గూస్ బంప్స్ పక్కా!

సరిలేరు నీకెవ్వరూ.. అంటూ సందడి చేసేందుకు సిద్ధమైన సూపర్ స్టార్ మహేష్ బాబు.. అంచనాలను మరింతగా పెంచేస్తున్నాడు. సంక్రాంతికి రాబోతున్న ఈ సినిమా ట్రైలర్ లేటెస్ట్‌గా విడుదల చేసింది చిత్రయూనిట్.
పక్కా కామెడీ మాస్ ఎంటర్ టైనర్ గా సరిలేరు నీకెవ్వరు తెరకెక్కిందని మేకర్స్ ముందునుంచీ చెబుతూనే ఉన్నారు. ఎమోషన్స్, ఎలివేషన్స్.. అద్భుతంగా కుదిరాయి. ట్రైలర్ ను సీన్ బై సీన్ చూస్తుంటే ఈ విషయం అర్థం అవుతుంది. 2నిమిషాల 24 సెకన్ల ట్రైలర్లో 1.08 సెకన్ల పాటు కామెడీ తర్వాతనుంచి… అసలైన యాక్షన్ మొదలెట్టి పర్‌ఫెక్ట్‌గా కట్ చేశారు.
రైల్లో కామెడీతో కేక పెట్టించాడు దర్శకుడు అనిల్ రావిపూడి. రష్మిక, సంగీత, బండ్లగణేశ్, రాజేంద్రప్రసాద్ ఈ బ్యాచ్ తో మహేశ్ చేసే అల్లరి మామూలుగా లేదు. అనిల్ రావిపూడి ప్రతి సినిమాలో కామెడీకి ఓ స్టైల్ ఉంటుంది. ప్రతి సినిమాలోలాగే.. ఇందులోనూ ఓ మేనరిజమ్ కనిపించింది.
కొండారెడ్డి బురుజు దగ్గర ‘ఒక్కడు’ మార్క్ తో ప్రకాశ్ రాజ్ విలనిజం చూపించారు. బురుజు దగ్గర ఫైట్ థియేటర్లో అభిమానులకు గూస్ బంప్స్ ఖాయమన్నట్లుగా కనిపిస్తుంది. డైరెక్టర్ అనిల్ రావిపూడి స్టేజీపై ఈ విషయాన్ని చెప్పాడు. దీంతో.. ఆ ఫైట్ ఆసక్తి రేపుతోంది. ఇదిలా ఉంటే డైరెక్టర్ అనీల్ రావిపూడి మరో సస్పెన్స్‌గా ఉన్న విషయాన్ని వెల్లడించాడు. ఈ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటించారనే విషయాన్ని చెప్పారు. అయితే అది ఏ పాత్ర అనేది మాత్రం వెల్లడించలేదు.