‘సరిలేరు నీకెవ్వరు’ రిలీజ్ తర్వాత ఆమె మాట్లాడుతున్నారనుకున్నా..

విజయ నిర్మల విగ్రహావిష్కరణ కార్యక్రమంలో సూపర్‌స్టార్ మహేష్ బాబు..

  • Published By: sekhar ,Published On : February 20, 2020 / 08:18 AM IST
‘సరిలేరు నీకెవ్వరు’ రిలీజ్ తర్వాత ఆమె మాట్లాడుతున్నారనుకున్నా..

Updated On : February 20, 2020 / 8:18 AM IST

విజయ నిర్మల విగ్రహావిష్కరణ కార్యక్రమంలో సూపర్‌స్టార్ మహేష్ బాబు..

ప్రముఖ నటి, మహిళా దర్శకురాలు, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్న విజయనిర్మల 74 వ జయంతి సందర్భంగా నానక్ రామ్ గూడా కృష్ణ విజయ నిర్మల నివాసంలో జరిగిన  కార్యక్రమంలో విజయనిర్మల విగ్రహాన్ని కృష్ణ ఆవిష్కరించారు.

సూపర్‌స్టార్ మహేష్ బాబు జ్యోతి ప్రజ్వలన చేసి, విజయ నిర్మల శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనతంరం ఆయన మాట్లాడుతూ : ‘‘నా సినిమా రిలీజ్ రోజు మార్నింగ్ షో చూసి నాన్నగారు ఫోన్ చేసి మాట్లాడేవారు. తర్వాత ఆమె కూడా విష్ చేసేవారు. మొన్న ‘సరిలేరు నీకెవ్వరు’ రిలీజ్ రోజు కూడా నాన్న గారు ఫోన్ చేసి విష్ చేశారు.

ఆమె మాట్లాడబోతున్నారనుకున్నారు. ఆవిడ ఎక్కడున్నా చాలా సంతోషంగా ఉంటారు. విజయ నిర్మల గారి పుట్టినరోజు ప్రతి సంవత్సరం ఒక వేడుకగా జరుగుతుంది’’ అన్నారు.ఈ కార్యక్రమంలో కృష్ణంరాజు, మురళీమోహన్, మహేష్ బాబు, నమ్రత, ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, గల్లా జయదేవ్, నిర్మాత పివిపి, పరుచూరి గోపాల కృష్ణ, ఆదిశేషగిరరావు, శివకృష్ణ, మారుతి, నందిని రెడ్డి బ్రహ్మాజీ, శివ బాలాజీ తదితరులు పాల్గొన్నారు. 

Superstar Mahesh Babu

Read More>> గొప్ప దర్శకురాలు భార్య కావడం నా అదృష్టం – సూపర్‌స్టార్ కృష్ణ