Mahesh Babus family : సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యామిలీ శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్నారు. మహేష్ బాబు సతీమణి నమ్రత, కొడుకు గౌతమ్, కూతురు సితార అలిపిరి నడక మార్గంలో నడుచుకుంటూ తిరుమలకు చేరుకున్నారు.
సూపర్ స్టార్ ఫ్యామిలీని గమనించిన భక్తులు నడక మార్గంలో వారితో సెల్ఫీలు దిగేందుకు పోటీలు పడ్డారు. ఈ రోజు రాత్రి వారు తిరుమలలోనే బస చేయనున్నారు. రేపు (ఆగస్టు 15న ) బుధవారం నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకోనున్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే.. గుంటూరు కారం సినిమాతో హిట్ అందుకున్నమహేశ్ బాబు దర్శకదీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో ఓ సినిమాలో నటించనున్నారు. ఈ మూవీ కోసం మహేశ్ జుట్టు, బాడీ పెంచి లుక్ ను మార్చుకునే పనిలో ఉన్నారు. ఇక ఈ మూవీ స్క్రిప్ర్ వర్క్ పూర్తయిందని, మ్యూజిక్ వర్క్ జరుగుతుందని, త్వరలోనే పూజా కార్యక్రమాలతో సినిమా మొదలుపెడతారని సమాచారం.
Varun Tej : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వరుణ్‌తేజ్ దంపతులు