Double iSmart : ఏపీలో ‘డబుల్ ఇస్మార్ట్’ టికెట్ల ధరల పెంపునకు గ్రీన్ సిగ్నల్..! ఏకంగా 10 రోజులు..
యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటించిన తాజా చిత్రం డబుల్ ఇస్మార్ట్.

AP Govt Green Signal to Double Ismart ticket price hike
Double Ismart ticket price : యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటించిన తాజా చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. ఇస్మార్ట్ శంకర్‌కు సీక్వెల్‌గా ఈ మూవీ రూపుదిద్దుకోవడంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఆగస్టు 15న (గురువారం) ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డబుల్ ఇస్మార్ట్ చిత్ర బృందానికి శుభవార్త చెప్పింది.
మూవీ టికెట్ల రేట్లను పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. సినిమా విడుదలైన రోజు నుంచి ఒక్కొ టికెట్‌కు రూ.35 వరకు పెంచుకోవచ్చునంటూ జీవో ఇచ్చింది. పది రోజుల పాటు ఈ సౌలభ్యాన్ని కల్పించింది. లాంగ్ వీకెంట్ నేపథ్యంలో మూవీ టీమ్‌కు ఇది శుభవార్త అనే చెప్పవచ్చు.
Varun Tej : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వరుణ్‌తేజ్ దంపతులు
కావ్యా థపర్ హీరోయిన్ కాగా విలన్‌గా సంజయ్ దత్ కనిపించనున్నాడు. ఈ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ అందించారు. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. చార్మితో కలిసి పూరి జగన్నాథ్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక సినిమా హిట్ కావడం అటు పూరీకి ఇటు రామ్‌కి చాలా కీలకం.