Food entry in Theaters : సినిమాహాళ్లలో బయటి ఫుడ్ నిషేధాన్ని సమర్ధించిన సుప్రీంకోర్ట్.. కానీ..

థియేటర్స్ లోకి బయటి ఫుడ్ నిషేధం పిటిషన్ పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ పీఎస్‌ నరసింహతో కూడిన ధర్మాసనం విచారణ జరిపి గతంలో జమ్మూకశ్మీర్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును తోసిపుచ్చింది. దీనిపై..................

Food entry in Theaters : సినిమాహాళ్లలో బయటి ఫుడ్ నిషేధాన్ని సమర్ధించిన సుప్రీంకోర్ట్.. కానీ..

supreme court judgement on Food entry in Theaters

Updated On : January 4, 2023 / 9:42 AM IST

Food entry in Theaters :  గతంలో సినిమా హాల్స్ లోకి మన ఇష్టమైన ఫుడ్ ని తీసుకొని వెళ్లి తినేవాళ్ళం. కానీ మల్టిప్లెక్స్ థియేటర్స్ వచ్చాక బయటి ఫుడ్ ని థియేటర్స్ లోకి అనుమతి ఇవ్వడం మానేశారు. బయటి ఫుడ్ ని థియేటర్స్ లోకి నిషేదించారు. ఏమన్నా కావాలంటే అక్కడే కొనుక్కోవాలి. ఇది చూసి సింగిల్ స్క్రీన్ థియేటర్స్ కూడా ఇదే పద్దతిని మొదలుపెట్టాయి. దీనివల్ల సాధారణ ప్రేక్షకులు ఇబ్బంది పడుతున్నారు. అక్కడ థియేటర్స్ లోపల కొనుక్కుందామంటే వాటి రేట్లేమో ఆకాశంలో ఉంటాయి.

ఇప్పటికి దీనిపై వాదనలు జరుగుతూనే ఉన్నాయి. 2018లో జమ్మూ కాశ్మీర్ హైకోర్టు థియేటర్స్ లోకి బయట నుంచి తెచ్చుకునే ఆహారంపై నిషేధాన్ని ఎత్తివేస్తూ తీర్పు ఇచ్చింది. ఇది అమలయితే థియేటర్స్, మల్టిప్లెక్స్ వాళ్ళకి చాలా నష్టం చేకూరుతుంది. దీంతో జమ్మూ కాశ్మీర్ హైకోర్టు ఇచ్చిన తీర్పుని సవాలు చేస్తూ థియేటర్ల యాజమాన్యాలు, మల్టిప్లెక్స్ అసోసియేషన్ అఫ్ ఇండియా సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

Pragathi : నా మెచ్యూరిటీ లెవెల్ కి తగ్గవాళ్ళు దొరకాలి కదా.. రెండో పెళ్లిపై ప్రగతి వ్యాఖ్యలు..

ఈ పిటిషన్ పై అనేక చర్చలు, వాయిదాల అనంతరం మంగళవారం నాడు దీనిపై సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. థియేటర్స్ లోకి బయటి ఫుడ్ నిషేధం పిటిషన్ పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ పీఎస్‌ నరసింహతో కూడిన ధర్మాసనం విచారణ జరిపి గతంలో జమ్మూకశ్మీర్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును తోసిపుచ్చింది. దీనిపై.. సినిమా హాలు అనేది ప్రైవేట్ ఆస్తి కాబట్టి బయటి నుంచి ఆహారాన్ని అనుమతించాలా? వద్దా? అనే అధికారం థియేటర్ల యాజమాన్యాలకు ఉంటుంది. అయితే థియేటర్స్ లోపల ఆహార పదార్థాలని కొనుగోలు చేయమని ప్రేక్షకులని ఇబ్బందిపెట్టకూడదు. అలాగే చిన్న పిల్లలకి ఇచ్చే ఆహారాన్ని మాత్రం అనుమతించాలి. అలాగే త్రాగునీరు మాత్రం ఉచితంగా ఇవ్వాలి అని సుప్రీం కోర్ట్ తీర్పు ఇచ్చింది. దీనిపై థియేటర్, మల్టిప్లెక్స్ యాజమాన్యాలు సంతోషం వ్యక్తం చేస్తున్నా సాధారణ ప్రేక్షకుడు మాత్రం నిరాశ చెందుతున్నాడు.