శభాష్ సాయి ధరమ్ తేజ్.. మాట ఇచ్చాడు.. నిలబెట్టుకున్నాడు..

శభాష్ సాయి ధరమ్ తేజ్.. మాట ఇచ్చాడు.. నిలబెట్టుకున్నాడు..

Updated On : December 18, 2020 / 4:05 PM IST

Sai Dharam Tej fulfills his promise: ఈరోజుల్లో ఏ విషయంలోనైనా కమిట్‌మెంట్ ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. కానీ సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ మాట ఇవ్వడమే కాకుండా ఇచ్చిన మాట మీద నిలబడి అన్నమాట ప్రకారం ఇచ్చిన హామీ నెరవేర్చాడు.

వివరాళ్లోకి వెళ్తే.. గతేడాది విజయవాడకు చెందిన అమ్మ ప్రేమ ఆదరణ సేవా వృద్ధాశ్రమం వారు తమ ఓల్డేజ్ హోమ్ నిర్మాణానికి సాయం చేయాలని సాయి ధరమ్‌ను ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేశారు.

దీంతో సాయి ధరమ్ తేజ్ తన పుట్టినరోజు నాడు పలు సేవా కార్యక్రమాలు చేస్తున్న అభిమానులకు ఈ విషయాన్ని వీడియో ద్వారా వెల్లడించగా వారందరూ బర్త్‌డే రోజు ఫ్లెక్సీలు, కేక్ కటింగ్స్ వంటివి చేయకుండా ఆ డబ్బుతో తమవంతు సాయమందించారు. అలాగే బిల్డింగ్ పూర్తి చేయడంతో పాటు ఒక సంవత్సరం వరకు ఆ ఓల్డేజ్ హోమ్‌కు తను స్పాన్సర్ షిప్ అందిస్తున్నట్లు తెలియచేశాడు సాయి..

https://10tv.in/supreme-hero-sai-dharam-tej-inaugurated-the-new-building-of-amma-prema-adarana-old-age-home-in-vijayawada/

చెప్పినట్లుగానే సంవత్సరం కల్లా అమ్మ ప్రేమ ఆదరణ సేవా వృద్ధాశ్రమం బిల్డింగ్ నిర్మాణం పూర్తి చేశారు. ఏ దిక్కూ లేని వృద్ధులకు ఆశ్రయం కల్పించిన సాయి ధరమ్ తేజ్‌కు ఓల్డేజ్ హోమ్ వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు, మెగాభిమానులు, నెటిజన్లు సాయి ధరమ్ తేజ్‌ను అభినందిస్తున్నారు.

Sai Dharam Tej