సూర్య ‘కంగువ’ టీజర్ వచ్చేసింది.. హాలీవుడ్ మూవీ రేంజ్‌లో..
సూర్య నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ కంగువ టీజర్ వచ్చేసింది.

Suriya Disha Patani Bobby Deol Kanguva Sizzle Teaser released
Kanguva Teaser : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, తమిళ మాస్ డైరెక్టర్ శివతో కలిసి తెరకెక్కిస్తున్న ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘కంగువ’. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా చిత్రంగా రూపొందిస్తున్నారు. ఆల్రెడీ ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ అండ్ పోస్టర్స్ తో మేకర్స్ ఆడియన్స్ లో భారీ అంచనాలు క్రియేట్ చేసారు. ఇప్పుడు ఆ అంచనాలను మరింత పెంచడానికి మూవీ నుంచి టీజర్ ని రిలీజ్ చేసారు.
Also read : Ustaad Bhagat Singh : ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గ్లింప్స్ రిలీజ్.. గాజు పగిలేకొద్ది పదునెక్కుద్ది..
టీజర్ ని డైలాగ్స్ లేకుండా నడిపించేశారు. కానీ విజువల్ గా మాత్రం గూస్‌బంప్స్ తెప్పించారు. అడవి, భయంకరమైన ఆదివాసులు, ఖడ్గమృగాలు, సముద్రం.. షాట్స్ తో ఒక కొత్త లోకాన్ని చూపించారు. ఒక పీరియాడికల్ సబ్జెట్ ని శివ లాంటి కమర్షియల్ డైరెక్టర్ ఈ రేంజ్ లో చూపించడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. మొత్తంగా టీజర్ అయితే ఆడియన్స్ తో వావ్ అనిపించేలా ఉంది.
కాగా ఈ మూవీ నుంచి గతంలో సూర్య వైల్డ్ లుక్ తో పాటు స్టైలిష్ మోడరన్ లుక్ ని కూడా రిలీజ్ చేసారు. ఈ మూవీ కథ మొత్తం మూడు టైం పీరియడ్స్ తో ఉండబోతుందని సమాచారం. భూత భవిష్యత్తు వర్తమాన కాలాలతో ఈ సినిమాని ఆడియన్స్ కి చూపించబోతున్నారు. మరి మిగిలిన ఆ మూడు కాలాల పాత్రలకు సంబంధించిన టీజర్ లు కూడా త్వరలో వస్తాయేమో చూడాలి.
ఈ సినిమాని 3Dలో మొత్తం 38 భాషల్లో రిలీజ్ చేయడానికి మేకర్స్ సిద్ధం చేస్తున్నారు. అయితే ఎప్పుడు రిలీజ్ చేస్తారు అన్న విషయాన్ని మాత్రం ఇంకా తెలియజేయలేదు. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.