Suriya : బాల బ్రదర్‌తో సినిమా చేస్తున్నా

వెర్సటైల్ యాక్టర్ సూర్య - విభిన్న కథా చిత్రాల దర్శకుడు బాల కలయికలో హ్యాట్రిక్ మూవీ..

Suriya : బాల బ్రదర్‌తో సినిమా చేస్తున్నా

Suriya

Updated On : October 28, 2021 / 12:43 PM IST

Suriya: విలక్షణ నటుడు సూర్య వరుసగా డిఫరెంట్ కాన్సెప్ట్స్, అంతే డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ తమిళ్‌తో పాటు తెలుగులోనూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ‘ఆకాశం నీ హద్దురా’ తో ఓటీటీలో సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఈ సినిమాకు ప్రేక్షకుల ప్రశంసలతో పాటు పలు అవార్డులూ వచ్చాయి.

Unstoppable with NBK : మాటల్లో ఫిల్టర్ ఉండదు.. సరదాలో స్టాప్ ఉండదు..

ప్రస్తుతం సూర్య నటించిన ‘జై భూమి’ నవంబర్ 2న ఓటీటీలో విడుదల కానుంది. ఇందులో సూర్య పేదల తరపున పోరాడడానికి న్యాయ వ్యవస్థపై ఎదురు తిరిగే పవర్‌ఫుల్ లాయర్ క్యారెక్టర్ చేశారు. ప్రోమోస్ ఇంట్రెస్టింగ్‌గా ఉండడంతో పాటు సినిమా మీద అంచనాలు పెంచాయి.

Jai Bhim Trailer : న్యాయస్థానం మౌనం.. చాలా ప్రమాదకరం..

నటుడిగా, నిర్మాతగా బిజీగా ఉన్న సూర్య ఇప్పుడు మరో క్రేజీ సినిమా సైన్ చేశారు. తన కెరీర్‌లో మెమరబుల్ మూవీ పితామగన్ (శివపుత్రుడు) ఇచ్చిన వెర్సటైల్ డైరెక్టర్ బాలా దర్శకత్వంలో సూర్య ఓ సినిమా చెయ్యబోతున్నారు.

Udanpirappe : జ్యోతిక 50వ సినిమా.. ట్రైలర్ చూశారా..

‘నంద’, ‘పితామగన్’ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత సూర్య – బాల కలయికలో వస్తున్న మూడో సినిమా ఇది. ఈ ప్రాజెక్ట్ గురించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇస్తూ సూర్య తండ్రి సీనియర్ నటుడు శివకుమార్‌తో బాల – సూర్య ఉన్న పిక్ షేర్ చేశారు. పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి.

Peddanna : ట్రైలర్ అదిరింది.. బొమ్మ పక్కా బ్లాక్‌బస్టర్..