భూమి భారతి నీ పయనానికి జయహో అన్నది : ఆకట్టుకుంటున్న సరిలేరు సెకండ్ సాంగ్

సూపర్‌స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా నటిస్తున్న‘‘సరిలేరు నీకెవ్వరు’’ సెకండ్ సాంగ్ రిలీజ్..

  • Published By: sekhar ,Published On : December 9, 2019 / 12:08 PM IST
భూమి భారతి నీ పయనానికి జయహో అన్నది : ఆకట్టుకుంటున్న సరిలేరు సెకండ్ సాంగ్

Updated On : December 9, 2019 / 12:08 PM IST

సూపర్‌స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా నటిస్తున్న‘‘సరిలేరు నీకెవ్వరు’’ సెకండ్ సాంగ్ రిలీజ్..

సూపర్‌స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో..  దిల్ రాజు సమర్పణలో అనిల్ సుంకర, మహేష్ బాబు కలిసి నిర్మిస్తున్న సినిమా.. ‘‘సరిలేరు నీకెవ్వరు’’.. ‘మాస్ ఎమ్‌బి మండేస్ దిస్ డిసెంబర్ 5 మండేస్ 5 సాంగ్స్ గెట్ రెడీ గయ్స్’ అంటూ డిసెంబర్ నెలలో ఉన్న అయిదు సోమవారాలలో వారానికి ఒక పాట చొప్పున రిలీజ్ చేయనున్నామని తెలిపిన మూవీ టీమ్ ‘మైండ్ బ్లాక్’ సాంగ్ తర్వాత రెండో సోమవారం రెండో పాట విడుదల చేశారు.

Suryudivo Chandrudivo - Lyrical - Sarileru Neekevvaru

‘సూర్యుడివో చంద్రుడివో, ఆ ఇద్దరి కలయికవో.. సారధివో వారధివో, మా ఊపిరి కన్నకలవో.. విశ్వమంతా ప్రేమ పండించగా పుట్టుకైన ఋషివో.. సాటివారికై నీ వంతుగా ఉద్యమించు కృషివో, మా అందరిలో ఒకడైన మనిషివో’ అంటూ సాగే ఈ బ్యూటిఫుల్ మెలోడి ఆకట్టుకుంటోంది. దేవి ట్యూన్‌కి రామజోగయ్య శాస్త్రి అద్భుతమైన సాహిత్యమందివగా పాపులర్ పంజాబీ సింగర్ బి ప్రాక్ చాలా బాగా పాడాడు. మహేష్, విజయశాంతి ఫ్మామిలీ నేపథ్యంలో ఈ పాట తెరకెక్కింది.

Image

ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, సుబ్బరాజు, వెన్నెల కిశోర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. మహేష్ మేజర్ అజయ్ కృష్ణగా కనిపించనున్న ‘సరిలేరు నీకెవ్వరు’ సంక్రాంతి కానుకగా 2020 జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.