Sushant Singh Rajput Death : ఆదిత్య చోప్రా విచారణ

  • Published By: madhu ,Published On : July 19, 2020 / 07:26 AM IST
Sushant Singh Rajput Death : ఆదిత్య చోప్రా విచారణ

ramleela

Updated On : December 27, 2022 / 11:03 AM IST

బాలీవుడ్ లో ఎంతో భవిష్యత్ ఉన్న యంగ్ హీరో సుశాంత్ మరణం..పై పోలీసుల దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే పలువురిని విచారించిన కాప్స్ తాజాగా ముంబై పోలీసులు Filmmaker Aditya Chopra స్టేట్ మెంట్ ను రికార్డు చేశారు. వెర్సోవా పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఆదిత్య…ను బాంద్రా పోలీసులు విచారించారు. సుమారు నాలుగు గంటల పాటు ఈ విచారణ కొనసాగిందని తెలుస్తోంది.

2020, జూన్ 14వ తేదీన సుశాంత్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటన బాలీవుడ్ ను కుదిపేసింది. హిందీ పరిశ్రమలో జరుగుతున్న కారణాలు, గుత్తాధిపత్యం వల్లే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని పలువురు బాహాటంగానే విమర్శలు చేశారు.

దీనిపై సీబీఐ విచారణ జరిపించాలనే డిమాండ్స్ వినిపించాయి. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు కొన్ని రోజుల క్రితం టీవీ, నటుడు శేఖర్ సుమన్ ఓ ఫోరాన్ని ప్రారంభించారు.
మరోవైపు ముంబై పోలీసులు దీనిపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే పలువురిని విచారించారు. సుశాంత్ సూసైడ్ చేసుకున్నారని నిర్ధారించారు.

సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ…సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి..హోం మంత్రి షాను కోరడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ మేరకు ఆమె గురువారం ట్విట్టర్ వేదికగా అమిత్ షాకు రెండు వరుస ట్వీట్లు చేశారు. కొద్ది రోజుల క్రితం సుశాంత్ చనిపోవడానికి కారణం రియా అంటూ ఆమెపై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్యపై సీబీఐ విచారణ చేపట్టాల్సిందిగా బీహార్‌ జన్‌ అధికార్‌ పార్టీ అధ్యక్షుడు పప్పు యాదవ్‌ కేంద్ర హోం మంత్రి అమీత్ షాను కోరారు. ఈ లెటర్ ను సంబంధిత శాఖకు పంపించారు. ప్రస్తుతం సుశాంత్ సూసైడ్ లో సీబీఐ విచారణ కోరుతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది.