Lopaliki Raa Cheptha : ‘లోపలికి రా చెప్తా’ హారర్ కామెడీ.. రిలీజ్ ఎప్పుడంటే..
తాజాగా ఈ హారర్ కామెడీ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు.

Susmitha Anala Lopaliki Raa Cheptha Movie Release Date Announced
Lopaliki Raa Cheptha : కొండా వెంకట రాజేంద్ర, మనిషా జష్నాని, సుస్మిత అనాల, సాంచిరాయ్ మెయిన్ లీడ్స్ లో తెరకెక్కుతున్న సినిమా లోపలికి రా చెప్తా. మాస్ బంక్ మూవీస్ బ్యానర్ పై లక్ష్మీ గణేష్, వెంకట రాజేంద్ర సంయుక్త నిర్మాణంలో హారర్ కామెడీ ఎంటర్టైనర్ గా కొండా వెంకట రాజేంద్ర దర్శకత్వంలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి పలు పోస్టర్స్, సాంగ్స్ రిలీజ్ చేసారు. తాజాగా ఈ హారర్ కామెడీ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు. ‘లోపలికి రా చెప్తా’ సినిమా జూలై 5న థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ వెంకట రాజేంద్ర మాట్లాడుతూ.. మా సినిమాలో హీరో క్యారెక్టర్ డెలివరీ బాయ్. అందుకే ఈ సినిమాలోని మొదటి సాంగ్‌ను ఓ డెలివరీ బాయ్‌తో విడుదల చేయించాం. ఆ పాటకు మంచి స్పందన వచ్చింది. త్వరలోనే ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నాం. సెన్సార్ కూడా పూర్తయింది. జూలై 5న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ చేస్తున్నాం. త్వరలో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహిస్తాం అని తెలిపారు.