Honey Kids : 100% VFX తో సినిమా.. ‘హనీ కిడ్స్’ ఫస్ట్ పోస్టర్ రిలీజ్..
తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ పోస్టర్ లీజ్ చేసారు.

Swapna Chowdary Honey Kids VFX Movie Poster Released
Honey Kids : తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మాణంలో భీమవరం టాకీస్ బ్యానర్ పై హర్ష.ఎం దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘హనీ కిడ్స్’. ఈ సినిమాలో తల్లాడ సాయికృష్ణ, అమ్మినేని స్వప్నా చౌదరి, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, కిషోర్ దాస్, వినోద్ నువ్వుల, కృష్ణ.. పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
అయితే ఈ సినిమాని భారతదేశంలో మొట్టమొదటి పూర్తి స్థాయి 100 శాతం VFX ఆధారిత సినిమాగా, ఫాంటసీ-సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ సినిమాని ఓ కొత్త లోకం సృష్టించి తెరకెక్కిస్తున్నామని దర్శక నిర్మాతలు తెలిపారు. ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయిందని సమాచారం. ప్రస్తుతం VFX వర్క్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ పోస్టర్ గా హీరోయిన్ స్వప్న చౌదరి అమ్మినేని పోస్టర్ రిలీజ్ చేసారు. ఈ పోస్టర్ లో హీరోయిన్ సూపర్ వుమెన్ లా ఉంది. ఈ మేరకు స్వప్న చౌదరి మాట్లాడుతూ.. ఈ జానర్ సినిమా పిల్లలకు బాగా నచ్చుతుందని తెలిపింది.