Ananthika Sanilkumar : రాజకీయాల్లోకి వస్తా.. అందుకే ఆ కోర్స్ చదువుతున్నా.. వామ్మో ఈ హీరోయిన్ కి ఇన్ని విద్యలు వచ్చా..?

హీరోయిన్ అనంతిక సనీల్ కుమార్ కి చాలా రంగాల్లో ప్రవేశం ఉందని తెలిసి ఆశ్చర్యపోతున్నారు.

Ananthika Sanilkumar : రాజకీయాల్లోకి వస్తా.. అందుకే ఆ కోర్స్ చదువుతున్నా.. వామ్మో ఈ హీరోయిన్ కి ఇన్ని విద్యలు వచ్చా..?

Actress Ananthika Sanilkumar Wants to Enter in Politics

Updated On : June 17, 2025 / 3:06 PM IST

Ananthika Sanilkumar : కొంతమంది సినీ సెలబ్రిటీలకు నటనతో పాటు వేరే విద్యల్లో కూడా ప్రవేశం ఉంటుంది. తాజాగా హీరోయిన్ అనంతిక సనీల్ కుమార్ కి చాలా రంగాల్లో ప్రవేశం ఉందని తెలిసి ఆశ్చర్యపోతున్నారు. మ్యాడ్ సినిమాతో తెలుగులో ఫేమ్ తెచ్చుకుంది మలయాళీ భామ అనంతిక. ఆ తర్వాత వేరే భాషల్లో లాల్ సలాం, రైడ్ సినిమాల్లో కనిపించింది. ఇప్పుడు తెలుగులో ఫిమేల్ ఓరియెంటెడ్ కథతో 8 వసంతాలు అనే సినిమాతో రాబోతుంది.

ఫణింద్ర నర్శెట్టి దర్శకత్వంలో అనంతిక మెయిన్ లీడ్ గా తెరకెక్కుతున్న 8 వసంతలు సినిమా జూన్ 20న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నేడు అనంతిక మీడియాతో మాట్లాడుతూ తన గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపింది.

Also See : Ananthika Sanilkumar : అనంతిక.. పద్దతిగా, క్యూట్ గా లేటెస్ట్ ఫొటోలు..

అనంతిక ఆల్రెడీ కరాటేలో బ్లాక బెల్ట్ తీసుకుంది. మలయాళం ఫేమస్ డ్యాన్స్ మొహినియాట్టం, కథాకళి కూడా నేర్చుకొని పలు ప్రదర్శనలు ఇచ్చింది. కేరళ మార్షల్ ఆర్ట్స్ కలరిపట్టు కూడా నేర్చుకుంది. ఇలా నాలుగు డిఫరెంట్ విద్యలు నేర్చుకోవడమే కాక చదువులో ఇంటర్ పూర్తిచేసింది. ఇప్పుడు లా కోర్స్ చదువుతుంది. ఓ 35 ఏళ్ళు వచ్చాక రాజకీయాల్లోకి వస్తానని, అదే తన డ్రీమ్ అని, అందుకే లా కోర్స్ చదువుతున్నాను అని తెలిపింది అనంతిక.

ఇక అనంతిక అసలు సినిమాలోకి వద్దామనుకోలేదట. అనుకోకుండా ఓ సినిమాలో బ్యాక్ గ్రౌండ్ డ్యాన్సర్ గా ఛాన్స్ రావడంతో వెళ్తే అక్కడ కెమెరామెన్ చూసి నటిగా ట్రై చేయమన్నాడట. అప్పట్నుంచి ట్రై చేయడంతో వచ్చిన మంచి అవకాశాలు సెలెక్ట్ చేసుకుంటుంది అని తెలిపింది.

 

View this post on Instagram

 

A post shared by Ananthika Sanilkumar (@ananthika_sanilkumar)

Also Read : Blind Spot : ‘బ్లైండ్ స్పాట్’ మూవీ రివ్యూ.. మర్డర్ ఎవరు చేసారు?