Blind Spot : ‘బ్లైండ్ స్పాట్’ మూవీ రివ్యూ.. మర్డర్ ఎవరు చేసారు?

బ్లైండ్ స్పాట్ ఒక మర్డర్ మిస్టరీ థ్రిల్లర్.

Blind Spot : ‘బ్లైండ్ స్పాట్’ మూవీ రివ్యూ.. మర్డర్ ఎవరు చేసారు?

Naveen Chandra Rashi Singh Blind Spot Movie Review

Updated On : June 14, 2025 / 4:02 PM IST

Blind Spot Movie Review : నవీన్‌ చంద్ర, రాశీ సింగ్‌ మెయిన్ లీడ్స్ లో తెరకెక్కిన సినిమా ‘బ్లైండ్ స్పాట్’. మ్యాంగో మాస్ మీడియా బ్యానర్ పై రామకృష్ణ వీరపనేని నిర్మాణంలో రాకేష్ వర్మ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. అలీ రెజా, గాయత్రి భార్గవి, రవి వర్మ, చైల్డ్ ఆర్టిస్ట్ హారిక.. పలువురు కీలక పాత్రల్లో నటించారు. గత నెల మే 9న థియేటర్స్ లో రిలీజ్ అవ్వగా తాజాగా ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది.

కథ విషయానికొస్తే.. జయరామ్(రవివర్మ), అతని రెండో భార్య దివ్య(రాశి సింగ్) కి గొడవ అవుతుంది. ఆ గొడవలో దివ్య.. పనిమనిషి లక్ష్మి(గాయత్రి భార్గవి)ని కొట్టడంతో జయరామ్ దివ్యని కొట్టి వెళ్ళిపోతాడు. దాంతో దివ్య సూసైడ్ చేసుకొని చనిపోతుంది. లక్ష్మి పోలీసులకు కాల్ చేయడంతో పోలీసాఫీసర్ విక్రమ్(నవీన్ చంద్ర) వచ్చి ఇది సూసైడ్ కాదు మర్డర్ అని చెప్పి అందర్నీ ఇన్వెస్టిగేట్ చేయడం మొదలుపెడతాడు.

విక్రమ్.. జయరామ్ ని, జయరామ్ తమ్ముడు ఆదిత్య(అలీ రేజా)ని, లక్ష్మిని, లక్ష్మి కూతురు మానస(హారిక)ని.. ఇలా అందర్నీ ఇన్వెస్టిగేట్ చేస్తాడు. మరి దివ్యని చంపింది ఎవరు? ఎందుకు చంపారు? అసలు అది సూసైడ్ కాదు మర్డర్ అని విక్రమ్ ఎలా కనిపెట్టాడు తెలియాలంటే తెరపై చూడాల్సిందే..

Also Read : Devil’s Double Next Level : ‘డెవిల్స్ డబుల్: నెక్స్ట్ లెవల్’ మూవీ రివ్యూ.. రివ్యూలు చెప్పే వాళ్ళ మీద పగతో దయ్యంగా మారిన డైరెక్టర్ ఏం చేసాడంటే..?

సినిమా విశ్లేషణ.. బ్లైండ్ స్పాట్ ఒక మర్డర్ మిస్టరీ థ్రిల్లర్. ఒకరు సూసైడ్ చేసుకొని చనిపోతే అది సూసైడ్ కాదు మర్డర్ అని తెలియడంతో ఎవరు చేసారో కనిపెట్టే కథాంశం. ఇలాంటి కథాంశంతో చాలా సినిమాలు వచ్చాయి. ఇది కూడా అదే కోవలోకి చెందుతుంది. అయితే సినిమా అంతా చాలా స్లో నేరేషన్ తో సాగుతుంది. అక్కర్లేకపోయినా డైలాగ్ డైలాగ్ కి మధ్య గ్యాప్స్, నటుల మీద కెమెరా ఫ్రేమ్స్ ఎక్కువ సేపు ఉంచడంతో ఫార్వార్డ్ చేసుకుంటూ చూడాలి అనిపిస్తుంది. తక్కువ లెంగ్త్ ఉండటం కాస్త ప్లస్ అయింది.

సినిమా మొదలైన అరగంటకు వీళ్ళే దివ్యని చంపేశారు అని తేల్చేస్తారు. కానీ ఆ తర్వాత మరిన్ని ట్విస్టులు ఇచ్చి వీళ్ళు కాదు ఇంకొకరు అంటూ కథని నడిపారు. ఆ ట్విస్టులు బాగానే రాసుకున్నారు. కానీ సినిమా నడుస్తున్న కొద్ది అసలు హంతకులు ఎవరో రెగ్యులర్ గా సినిమాలు చూసేవాళ్ళు గెస్ చేసేయొచ్చు. మొదటి అరగంట ఒకే ఇంట్లో ఇన్వెస్టిగేషన్ తో నిదానంగా సాగినా ఆ తర్వాత అసలు హంతకులు ఎవరు అనేది కనిపెట్టడానికి బాగానే రాసుకున్నారు. చివర్లో దీనికోసమే హత్య చేసారా అనే సింపుల్ కారణంతో ముగించేయడం గమనార్హం. ఒక్కసారి చూడొచ్చు కాస్త ఓపికతో. ఇక ఈ సినిమా కరోనా ముందు ఓ నాలుగైదేళ్ల క్రితం తీసారేమో అని సందేహం రాక మానదు.

blind spot

నటీనటుల పర్ఫార్మెన్స్.. నవీన్ చంద్ర ఇలాంటి థ్రిల్లర్ సినిమాలు అంటే అదరగొట్టేస్తాడు. ఈ సినిమాలో కూడా తన బెస్ట్ పర్ఫరామెన్స్ ఇచ్చాడు. పనిమనిషి పాత్రలో గాయత్రీ భార్గవికి మంచి పాత్రే పడింది. హీరోయిన్ రాశి సింగ్ కూడా కాసేపే కనిపించినా మెప్పించింది. రవివర్మ, అలీ రెజా, హారిక.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో బాగానే నటించారు.

సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. సగం సినిమా ఒకే లొకేషన్ లో రాత్రి పూటే జరగడంతో దానికి తగ్గట్టు విజువల్స్ పర్ఫెక్ట్ గా చూపించారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగానే ఇచ్చారు. ట్విస్టులతో కథాంశం బాగానే రాసుకొని బాగా సాగదీసినా సాంకేతికంగా చక్కగా డీల్ చేసాడు డైరెక్టర్. ఎడిటింగ్ లో కచ్చితంగా చాలా సీన్స్ షార్ప్ కట్ చేస్తే బెటర్ గా ఉండేది. నిర్మాణ పరంగా కావాల్సినంత ఖర్చుపెట్టారు.

Also Read : Tollywood : రేపే సీఎం చంద్రబాబుతో సినీ ప్రముఖులు భేటీ.. ఎవరెవరు వెళ్తున్నారంటే? అప్పుడు చిరంజీవి.. ఇప్పుడు బాలకృష్ణ..

మొత్తంగా ‘బ్లైండ్ స్పాట్’ ఓ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా కాస్త ఓపికతో చూడొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.