Tollywood : రేపే సీఎం చంద్రబాబుతో సినీ ప్రముఖులు భేటీ.. ఎవరెవరు వెళ్తున్నారంటే? అప్పుడు చిరంజీవి.. ఇప్పుడు బాలకృష్ణ..

తాజా టాలీవుడ్ సమాచారం ప్రకారం అప్పుడు చిరంజీవి ఆధ్వర్యంలో వెళ్తే ఈసారి బాలకృష్ణ ఆధ్వర్యంలో వెళ్తున్నట్టు తెలుస్తుంది.

Tollywood : రేపే సీఎం చంద్రబాబుతో సినీ ప్రముఖులు భేటీ.. ఎవరెవరు వెళ్తున్నారంటే? అప్పుడు చిరంజీవి.. ఇప్పుడు బాలకృష్ణ..

Tollywood Celebrities Meets CM Chandrababu Under Balakrishna and Pawan Kalyan Lead

Updated On : June 14, 2025 / 3:07 PM IST

Tollywood : ఇటీవల థియేటర్స్ ఇష్యూ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ థియేటర్స్, టాలీవుడ్ పై సీరియస్ అయిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ ప్రముఖులు సీఎం ని కలిసారా అని పవన్ ప్రశ్నించడంతో టాలీవుడ్ పెద్దలు సీఎంని కలవడానికి సిద్ధం అయ్యారు. గతంలో కరోనా తర్వాత థియేటర్స్ కోసం, టికెట్ రేట్ల కోసం చిరంజీవి ఆధ్వర్యంలో పలువురు హీరోలు, నిర్మాతలు, దర్శకులు అప్పటి సీఎం వైఎస్ జగన్ ని కలిశారు. దీంతో ఈ సారి సీఎం చంద్రబాబుని కలవడానికి ఎవరెవరు వెళ్తున్నారు అనేదానిపై ఆసక్తి నెలకొంది.

తాజా టాలీవుడ్ సమాచారం ప్రకారం అప్పుడు చిరంజీవి ఆధ్వర్యంలో వెళ్తే ఈసారి బాలకృష్ణ ఆధ్వర్యంలో వెళ్తున్నట్టు తెలుస్తుంది. రేపు మొదట పవన్ కళ్యాణ్ ని కలిసి అనంతరం పవన్ తో కలిసి సీఎం చంద్రబాబు ఇంటికి వెళ్లనున్నారు టాలీవుడ్ ప్రముఖులు. ఇప్పటివరకు వచ్చిన లిస్ట్ ప్రకారం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ తో భేటీ అయ్యేవారిలో డైరెక్టర్ లు బోయపాటి శ్రీను, త్రివిక్రమ్ శ్రీనివాస్, రాజమౌళి, నాగ్ అశ్విన్, నిర్మాతలు అశ్వినీ దత్, దిల్ రాజు, అల్లు అరవింద్, దానయ్య, కెవి రామారావు, హీరోలు.. బాలకృష్ణ, వెంకటేష్, మనోజ్, సుమన్, ఆర్.నారాయణమూర్తి, నాని.. ఇలా దాదాపు 35 నుంచి 40 మంది హాజరు అవ్వనున్నారు.

Also Read : Coolie : ‘కూలి’ ఫస్ట్ హాఫ్‌కు సూపర్‌ స్టార్ ర‌జినీకాంత్ ఫిదా..

అయితే గతంలో చిరంజీవి ఆధ్వర్యంలో వెళ్లడం, ఈసారి అసలు చిరంజీవి వెళ్లకపోవడంతో ఆసక్తి నెలకొంది. దీంతో ఈసారి బాలకృష్ణ ఆధ్వర్యంలో అంతా వెళ్తున్నారు, అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు కాబట్టి ఇద్దరూ సీఎం చంద్రబాబుకి బాగా క్లోజ్ కాబట్టి ప్రత్యేకంగా చిరంజీవి వెళ్లాల్సిన అవసరం లేదేమో అని పలువురు భావిస్తున్నారు.

రేపు సాయంత్రం సీఎం చంద్రబాబును 4 గంటలకు కలవనున్నారు. దీంతో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ఈ మీటింగ్ లో ఏం చర్చిస్తారు, ప్రభుత్వం ఏం చెబుతుంది, సినీ ప్రముఖులు ఏం కోరతారు అని ఆసక్తి నెలకొంది. ఈ సమావేశం అనంతరం ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లతో మంత్రి కందుల దుర్గేష్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.

Also Read : Sreeleela Birthday : శ్రీలీల బర్త్ డే.. ఉస్తాద్ భగత్ సింగ్ స్పెషల్ పోస్టర్..