Sreeleela Birthday : శ్రీలీల బర్త్ డే.. ఉస్తాద్ భగత్ సింగ్ స్పెషల్ పోస్టర్..

ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ డైరెక్ష‌న్‌లో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టిస్తున్న మూవీ ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌.

Sreeleela Birthday : శ్రీలీల బర్త్ డే.. ఉస్తాద్ భగత్ సింగ్ స్పెషల్ పోస్టర్..

Sreeleela Birthday special poster from Ustaad Bhagat Singh movie

Updated On : June 14, 2025 / 11:18 AM IST

ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ డైరెక్ష‌న్‌లో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టిస్తున్న మూవీ ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌. ఈ చిత్రంలో ప‌వ‌న్ స‌ర‌స‌న శ్రీలీల న‌టిస్తోంది. కాగా నేడు శ్రీలీల పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆమెకు చిత్ర బృందం ఓ స్పెష‌ల్ పోస్ట‌ర్ ద్వారా బ‌ర్త్‌డే విషెస్ తెలియ‌జేసింది.

ఈ పోస్ట‌ర్‌లో శ్రీలీల చాలా క్యూట్‌గా కనిపిస్తోంది. చేతిలో కాఫీ క‌ప్ ప‌ట్టుకుని నిలుచొని ఉంది. ప్ర‌స్తుతం ఈ పిక్ వైర‌ల్‌గా మారింది.

Ashwini Sree : మా అక్కని పెళ్లి చేసుకుంటే వన్ ప్లస్ వన్ ఆఫర్.. నేను కూడా వస్తా.. అడివి శేష్ తో బిగ్ బాస్ భామ వ్యాఖ్యలు..

 

View this post on Instagram

 

A post shared by Mythri Movie Makers (@mythriofficial)

ప్ర‌స్తుతం శ్రీలీల య‌మా బీజీగా ఉంది. ఆమె చేతిలో అర‌డ‌జ‌ను పైగా సినిమాలు ఉన్నాయి. మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా న‌టిస్తున్న ‘మాస్ జాత‌ర‌’, అక్కినేని అఖిల్ స‌ర‌స‌న ‘లెనిన్‌’, త‌మిళంలో శివ కార్తికేయ‌న్ స‌ర‌స‌న ‘ప‌రాశ‌క్తి’, హిందీలో కార్తీక్ ఆర్య‌న్‌కు జోడీగా ‘ఆషిఖి 3’, కిరీటి రెడ్డి హీరోగా తెలుగు, క‌న్న‌డ ద్విభాషా చిత్రం ‘జూనియ‌ర్’ చిత్రాల్లో శ్రీలీల న‌టిస్తోంది.