Ashwini Sree : మా అక్కని పెళ్లి చేసుకుంటే వన్ ప్లస్ వన్ ఆఫర్.. నేను కూడా వస్తా.. అడివి శేష్ తో బిగ్ బాస్ భామ వ్యాఖ్యలు..

తాజాగా ఢీ జోడి ఫైనల్ ఎపిసోడ్ ప్రోమోని రిలీజ్ చేసారు.

Ashwini Sree : మా అక్కని పెళ్లి చేసుకుంటే వన్ ప్లస్ వన్ ఆఫర్.. నేను కూడా వస్తా.. అడివి శేష్ తో బిగ్ బాస్ భామ వ్యాఖ్యలు..

Bigg Boss Fame Ashwini Sree Sensational Comments in Dhee Show with Adivi Sesh

Updated On : June 13, 2025 / 9:35 PM IST

Ashwini Sree : బిగ్ బాస్ తో ఫేమ్ తెచ్చుకున్న అశ్విని శ్రీ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాల్లో నటిస్తుంది. పలు టీవీ షో లలో కూడా కనిపించి అలరిస్తుంది. అశ్విని ప్రస్తుతం పాపులర్ డ్యాన్స్ షో అయిన ఢీ షోలో కూడా పాల్గొంటుంది. తాజాగా ఢీ జోడి ఫైనల్ ఎపిసోడ్ ప్రోమోని రిలీజ్ చేసారు. ఢీ ఫైనల్ ఎపిసోడ్ కి అడివి శేష్ గెస్ట్ గా వచ్చారు.

ఈ ప్రోమోలో అడివి శేష్ తో అశ్విని మాట్లాడుతూ.. మా అక్కకి మీరంటే చాలా ఇష్టం. ఒకవేళ మీరు మా అక్కని పెళ్లి చేసుకుంటే మీకు వన్ ప్లస్ వన్ ఆఫర్ వస్తుంది. అంటే అక్కని పెళ్లి చేసుకుంటే నేను కూడా వస్తాను. అది ఎలాగో చెప్తాను అని చెప్పింది. అయితే ప్రోమోలో అశ్విని మొత్తం మాట్లాడింది చూపించలేదు. దీంతో అశ్విని వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. హీరోతో ఇలా అనేసిందేంటి అని ఆశ్చర్యపోతున్నారు. మరి ఆ వన్ ప్లస్ వన్ ఆఫర్ ఎలాగో తెలియాలంటే ఎపిసోడ్ చూడాలేమో.

Also Read : SSMB 29 : మహేష్ – రాజమౌళి సినిమా.. నెక్స్ట్ షెడ్యూల్ షూట్ ఏ దేశంలోనో తెలుసా? షూటింగ్ ఎప్పుడు?

మొత్తానికి అశ్విని అలా మాట్లాడేసరికి ప్రోమో మరింత వైరల్ అవుతుంది. ఇక ఎప్పట్లాగే అశ్విని తన సోషల్ మీడియాలో హాట్ ఫోటోలు, రీల్స్ పోస్ట్ చేస్తూనే ఉంది. మీరు కూడా ప్రోమో చూసేయండి..

 

Also See : Meenaakshi Chaudhary : మీనాక్షి మెరుపులు.. స్టైలిష్ లుక్స్ లో మీనాక్షి చౌదరి ఫొటోలు..