SSMB 29 : మహేష్ – రాజమౌళి సినిమా.. నెక్స్ట్ షెడ్యూల్ షూట్ ఏ దేశంలోనో తెలుసా? షూటింగ్ ఎప్పుడు?

ఇప్పటికే ఈ సినిమా రెండు షెడ్యూల్స్ షూటింగ్ పూర్తి చేసుకొని మూడో షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.

SSMB 29 : మహేష్ – రాజమౌళి సినిమా.. నెక్స్ట్ షెడ్యూల్ షూట్ ఏ దేశంలోనో తెలుసా? షూటింగ్ ఎప్పుడు?

Mahesh Babu Rajamouli Priyanka Chopra SSMB 29 Movie Shooting Update

Updated On : June 13, 2025 / 8:43 PM IST

SSMB 29 : మహేష్ – రాజమౌళి సినిమా షూటింగ్ అనౌన్స్ చేసినప్పట్నుంచి ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. ప్రియాంక చోప్రా హీరోయిన్ గా, మలయాళం స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తుండటంతో పాన్ ఇండియా ఈ సినిమా కోసం ఎదురుచూస్తుంది. ఇప్పటికే ఈ సినిమా రెండు షెడ్యూల్స్ షూటింగ్ పూర్తి చేసుకొని మూడో షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.

మొదటి షెడ్యూల్ హైదరాబాద్ లో జరగ్గా, రెండవ షెడ్యూల్ ఒడిశా అడవుల్లో జరిగింది. మూడో షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్ లో వేసిన కాశీ సెట్ లో జరుగుతుంది. త్వరలో నాలుగో షెడ్యూల్ కోసం మూవీ యూనిట్ ఆఫ్రికా ఖండానికి వెళ్లనున్నారు. ఆఫ్రికాలోని కెన్యా దేశంలో రాజమౌళి స్వయంగా వెళ్లి ఎడారులు, అడవులు, జంతువులు ఉండే లొకేషన్స్ ని ఫైనల్ చేసిన సంగతి తెలిసిందే. రాజమౌళి గతంలో స్వయంగా కెన్యా లొకేషన్స్ గురించి పోస్ట్ చేసారు.

Also Read : Naveen Chandra : తన సినిమా రీ రిలీజ్ లో తనే డ్యాన్స్ వేసిన హీరో.. వీడియో వైరల్.. సీన్ రీ క్రియేషన్ అదిరిందిగా..

సమ్మర్ లో అక్కడ ఎండ ఎక్కువగా ఉంటుందని మార్చ్ లో జరగాల్సిన షెడ్యూల్ ని వాయిదా వేశారు. వచ్చే నెల జులైలో మహేష్ – రాజమౌళి మూవీ యూనిట్ కెన్యా దేశానికి వెళ్లనున్నారు. అలాగే ఆఫ్రికాలోని వేరే దేశాల్లోని నేషనల్ వైల్డ్ పార్క్స్ లో కూడా షూటింగ్ చేయబోతున్నట్టు సమాచారం. కొన్ని యాక్షన్ సీన్స్ ని అక్కడ అడవుల్లో తెరకెక్కించనున్నారు.

ఇక రాజమౌళి – మహేష్ సినిమా ఇండియానా జోన్స్ తరహాలో ఉంటుందని రాజమౌళి స్వయంగా తెలిపారు. ఆంజనేయ స్వామి తెచ్చిన సంజీవని మొక్క గురించి వెతుకులాటతో ఈ సినిమా కథాంశం అని ఇటీవల ఓ రూమర్ బాగా వైరల్ అయింది. అది నిజమో కాదో తెలీదు గాని రాజమౌళి మాత్రం అడవులు, ఎడారులు తిప్పి ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమా 2027 లో రిలీజ్ అవుతుందని సమాచారం.

Also Read : Raja Saab : ‘రాజాసాబ్’ షూటింగ్ సెట్ నుంచి ఫోటో వైరల్.. రెబల్ స్టార్ ఏం నవ్వుతున్నాడ్రా బాబు..