Naveen Chandra : తన సినిమా రీ రిలీజ్ లో తనే డ్యాన్స్ వేసిన హీరో.. వీడియో వైరల్.. సీన్ రీ క్రియేషన్ అదిరిందిగా..
తన డ్యాన్స్ తనే రీ క్రియేట్ చేయడంతో వీడియో వైరల్ గా మారింది.

Naveen Chandra Re Created Andala Rakshasi Dance Scenes in Theater Video goes Viral
Naveen Chandra : ఇటీవల అనేక పాత సినిమాలు, పాత సూపర్ హిట్ సినిమాలు, క్లాసిక్ సినిమాలు రీ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. జనాలు, ఫ్యాన్స్ కూడా ఒకప్పటి రోజులు మళ్ళీ గుర్తు తెచ్చుకోడానికి, సినిమా హాల్స్ లో ఎంజాయ్ చేయడానికి, రీల్స్ చేసి వైరల్ అవ్వడానికి ఈ రీ రిలీజ్ సినిమాలకు వస్తున్నారు. థియేటర్స్ లో రీ రిలీజ్ సినిమాలకు ఫ్యాన్స్, ప్రేక్షకులు థియేటర్లోనే సినిమాలోని సీన్స్ రీ క్రియేషన్స్ చేస్తున్నారు. సినిమాలోని పాటలకు డ్యాన్సులు వేస్తున్నారు.
అయితే ఎవరో ఫ్యాన్స్, ప్రేక్షకులు చేస్తే అది మాములు విషయమే కానీ ఏకంగా హీరోనే థియేటర్లో స్టెప్పులు వేసాడు, తన డ్యాన్స్ తనే రీ క్రియేట్ చేయడంతో వీడియో వైరల్ గా మారింది. నవీన్ చంద్ర, రాహుల్ రవీంద్రన్, లావణ్య త్రిపాఠి కీలక పాత్రల్లో తెరకెక్కిన అందాల రాక్షసి సినిమా 2012 లో రిలీజయి ఒక మంచి లవ్ స్టోరీగా అందర్నీ మెప్పించి క్లాసిక్ లవ్ స్టోరీగా నిలిచింది.
Also Read : Raja Saab : ‘రాజాసాబ్’ షూటింగ్ సెట్ నుంచి ఫోటో వైరల్.. రెబల్ స్టార్ ఏం నవ్వుతున్నాడ్రా బాబు..
13 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఈ సినిమా నేడు రీ రిలీజ్ అయింది. మూవీ యూనిట్ రీ రిలీజ్ ప్రమోషన్స్ కూడా చేసారు. ఈ క్రమంలో నవీన్ చంద్ర నేడు ఉదయం హైదరాబాద్ సంధ్య థియేటర్ కి వెళ్లి ఆడియన్స్ తో కలిసి సినిమా చూసారు. నవీన్ చంద్ర కూడా ప్రేక్షకుల్లాగే సినిమాని ఫుల్ గా ఎంజాయ్ చేసాడు. సినిమాలో తన పాట వచ్చినప్పుడు నిల్చొని డ్యాన్స్ వేసి, తన సీన్ ని తనే రీ క్రియేట్ చేసాడు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది.
ఈ వీడియో చూసి సినిమా ప్రేమికులు పొంగిపోతున్నారు. ఒక హీరో తన సినిమా రీ రిలీజ్ కి వచ్చి ఆడియన్స్ తో సినిమా చూసి డ్యాన్సులు వేయడం అంటే గ్రేట్ అని, నవీన్ చంద్రకు సినిమా అంటే ఎంత ఇష్టం అని, నవీన్ ని హీరోగా నిలబెట్టిన సినిమా మీద గౌరవం అని కామెంట్స్ చేస్తూ పొగిడేస్తున్నారు. మొత్తానికి నవీన్ థియేటర్లో ఎంజాయ్ చేసిన వీడియో వైరల్ గా మారింది.