Swathimuthyam Director : చిరంజీవి, నాగార్జునకి పోటీగా.. అది నిర్మాతల నిర్ణయం.. నాకు భయంగానే ఉంది..

సినిమా ప్రమోషన్స్ లో భాగంగా దర్శకుడు లక్ష్మణ్ సినిమా రిలీజ్ గురించి మాట్లాడారు. లక్ష్మణ్ మాట్లాడుతూ.. ''చిరంజీవి గారికి నేను వీరాభిమానిని. ఆయన ‘గాడ్‌ ఫాదర్‌’ సినిమా రిలీజ్ అవుతున్న రోజే నా మొదటి సినిమా................

Swathimuthyam Director : చిరంజీవి, నాగార్జునకి పోటీగా.. అది నిర్మాతల నిర్ణయం.. నాకు భయంగానే ఉంది..

Swathimuthyam Director lakshman spoke about movie release clash with star heros

Updated On : September 26, 2022 / 11:52 AM IST

Swathimuthyam Director :  నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు, హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు గణేష్‌ స్వాతిముత్యం సినిమాతో హీరోగా పరిచయం అవ్వబోతున్నాడు. వర్ష బొల్లమ్మ హీరోయిన్‌ గా నటిస్తుండగా కొత్త దర్శకుడు లక్ష్మణ్‌ కె.కృష్ణ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమా ఇప్పటికే పలుసార్లు వాయిదా పడింది. ఇటీవల ఈ సినిమాని దసరాకి అక్టోబర్ 5న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

దీంతో ఈ సినిమా యూనిట్ ప్రమోషన్స్ మొదలుపెట్టాయి. అయితే అదే రోజు మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్, కింగ్ నాగార్జున ది ఘోస్ట్ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ చేస్తున్న రోజే డెబ్యూ హీరో, డెబ్యూ డైరెక్టర్ సినిమా రిలీజ్ అంటే పెద్ద సాహసమనే చెప్పాలి. చిత్ర యూనిట్ ఈ సారి మాత్రం వాయిదా లేదు, దసరాకి వచ్చేస్తున్నాము అంటూ పక్కా చెప్పేశారు. ఈ చిత్ర యూనిట్ తీసుకున్న నిర్ణయంతో టాలీవుడ్ వర్గాలతో పాటు ప్రేక్షకులు కూడా ఆశ్చర్యపోతున్నారు.

vendhu thanindhathu kaadu : సినిమా హిట్ అవ్వడంతో.. హీరో శింబుకి కోటి రూపాయల కారు, డైరెక్టర్ గౌతమ్ మీనన్‌కి బైక్ గిఫ్ట్ ఇచ్చిన నిర్మాత

తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా దర్శకుడు లక్ష్మణ్ సినిమా రిలీజ్ గురించి మాట్లాడారు. లక్ష్మణ్ మాట్లాడుతూ.. ”చిరంజీవి గారికి నేను వీరాభిమానిని. ఆయన ‘గాడ్‌ ఫాదర్‌’ సినిమా రిలీజ్ అవుతున్న రోజే నా మొదటి సినిమా రిలీజ్‌ అవుతున్నందుకు హ్యాపీగా ఉంది. కానీ నాకు కొంచెం భయంగా కూడా ఉంది. చిరంజీవి, నాగార్జున లాంటి స్టార్ హీరోల సినిమాలు విడుదలవుతున్న రోజే మా సినిమా రిలీజ్ చేయడమనేది అది పూర్తిగా నిర్మాతల నిర్ణయం. ఇప్పటికే సినిమా చాలా సార్లు వాయిదా పడింది. పండగ రోజు కాబట్టి నిర్మాతలు ఆ రోజు రిలీజ్ చేయాలని అనుకున్నారు. స్వాతిముత్యం సినిమా మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ కాబట్టి పండగ రోజైతే ఫ్యామిలీస్ వస్తారని ఆ రోజే పోటీ ఉన్నా రిలీజ్ చేస్తున్నారు.