సైరా : గెటవుట్ ఫ్రమ్ మై మధర్ ల్యాండ్
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న హిస్టారికల్ మూవీ.. సైరా నరసింహారెడ్డి.. థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్..

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న హిస్టారికల్ మూవీ.. సైరా నరసింహారెడ్డి.. థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్..
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న హిస్టారికల్ మూవీ.. సైరా నరసింహారెడ్డి.. అమితాబ్ బచ్చన్, నయనతార, తమన్నా, జగపతిబాబు, సుదీప్, విజయ్ సేతుపతి తదితరులు కీలక పాత్రల్లో నటించగా.. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో, కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌పై, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు.
రీసెంట్‌గా సైరా థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. రత్నవేలు విజువల్స్, అమిత్ త్రివేది ఆర్ఆర్, వార్ షాట్స్, వీఎఫ్‌ఎక్స్, నిర్మాణ విలువలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ భాషల్లో ‘సైరా’ భారీగా విడుదల కానుంది.
సంగీతం : అమిత్ త్రివేది, కెమెరా : రత్నవేలు, ఎడిటింగ్ : ఎ.శ్రీకర్ ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్ : రాజీవన్ నంబియార్, విఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ : కమల్ కణ్ణన్.