అరివీర సంహార.. సైరా – టైటిల్ సాంగ్

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న హిస్టారికల్ మూవీ.. 'సైరా నరసింహారెడ్డి'.. టైటిల్ సాంగ్ రిలీజ్..

  • Published By: sekhar ,Published On : September 23, 2019 / 05:01 AM IST
అరివీర సంహార.. సైరా – టైటిల్ సాంగ్

Updated On : September 23, 2019 / 5:01 AM IST

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న హిస్టారికల్ మూవీ.. ‘సైరా నరసింహారెడ్డి’.. టైటిల్ సాంగ్ రిలీజ్..

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న హిస్టారికల్ మూవీ.. ‘సైరా నరసింహారెడ్డి’.. అమితాబ్ బచ్చన్, నయనతార, తమన్నా, జగపతిబాబు, సుదీప్, విజయ్ సేతుపతి తదితరులు కీలక పాత్రల్లో నటించగా.. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో, కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌పై, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది.

ఈ సందర్భంగా సైరా టైటిల్ సాంగ్ రిలీజ్ చేశారు. అమిత్ త్రివేది కంపోజ్ చేసిన ట్యూన్‌కి ప్రముఖ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి లిరిక్స్ రాయగా, ‘మెలోడి క్వీన్’ శ్రేయా ఘోషల్, సునిధి చౌహన్ చాలా బాగా పాడారు. సైరా నరసింహారెడ్డి గురించి చెప్తూ.. అతని క్యారెక్టర్‌ను పొగిడేలా రూపొందించిన టైటిల్ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

Read Also : సైరాలో క్యారెక్టర్స్ చూశారా!

గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ భాషల్లో ‘సైరా’  భారీగా విడుదల కానుంది. సంగీతం : అమిత్ త్రివేది, కెమెరా : రత్నవేలు, ఎడిటింగ్ : ఎ.శ్రీకర్ ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్ : రాజీవన్ నంబియార్, విఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ : కమల్ కణ్ణన్.