చిరంజీవితో త్రివిక్రమ్ ఇంటర్వ్యూ: ‘గణపతి బొప్పా మోరియా’ నినాదం వచ్చింది అలాగే!

తొలి స్వతంత్ర్య సమరయోధుడు, రేనాటి వీరుడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సైరా సినిమా తెలుగు రాష్ట్రాలలో విజయవంతంగా ఆడుతుంది. సక్సెస్ టాక్ సొంతం చేసుకుని థియేటర్లలో విజయవంతంగా ఆడుతున్న ఈ సినిమాపై సినీ లోకం ప్రశంసల జల్లును కురిపించింది. ఈ క్రమంలోపనే లేటెస్ట్ గా సినిమా హీరో చిరంజీవీ, రామ్ చరణ్ తో ఓ ప్రత్యేక ఇంటర్వ్యూ చేశారు త్రివిక్రమ్.
దసరా కానుకగా విడుదలైన ఈ ఇంటర్వ్యూ అనేక విషయాలను మాట్లాడుకున్నారు. ఈ సంధర్భంగా చిరంజీవి, రామ్ చరణ్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. సందర్భానుసారంగా ఎలా త్రివిక్రమ్ ఎలా మాట్లాడుతాడో అందరికీ తెలిసిందే. అవి ప్రశ్నలైనా.. డైలాగులైనా ఎంతో లోతుగా ఉంటాయి. స్టేజ్ ఎక్కితే మాటల ప్రవాహాన్ని వదులుతాడు ఈ మాటల మాంత్రికుడు. ఈ సారి కుర్చీలో కూర్చొని కూడా చాలా ఆసక్తికరమైన ప్రశ్నలు సంధించారు త్రివిక్రమ్. సైరా అద్భుతమైన విజయం సాధించిన సందర్భంగా.. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లను తెలిపారు.
సినిమాలో తమన్నా క్యారెక్టర్ చాలా గొప్పగా ఉంది అని చెబుతూ.. తమన్నా క్యారెక్టర్ రియల్ లైఫ్ లో బాల గంగాధర్ తిలక్ వంటి క్యారెక్టర్ అని చెప్పారు. సెకెండాఫ్ లో ఆమె క్యారెక్టర్ చాలా ఆకట్టుకుంటుందని అన్నారు. బాల గంగాధర్ తిలక్ జనం అందరిలో ఐకమత్యం రావడానికి ‘గణపతి బొప్పా మోరియా’ నినాదం తీసుకుని వచ్చారని త్రివిక్రమ్ చెప్పారు. బ్రిటీషోళ్లు ఎటువంటి ప్రొఫెషన్ అయినా ఆపేసేవారు. అటువంటి సమయంలో అందరినీ ఐకమత్యం చేసి గణేష్ నిమర్జనం వంకతో అందరినీ కలపడానికి బాలగంగాధర్ తిలక్ ట్రై చేశాడు అని చెప్పారు.
జాతీయస్ఫూర్తిని రగల్చడానికి వీలున్న ఏ అవకాశాన్నీ తిలక్ వదులుకోలేదు. మొట్టమొదటిసారిగా శివాజీ ఉత్సవాలను, గణపతి ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించడం ద్వారా ప్రజలను సమీకరించారు మరాఠాకు చెందిన బాల గంగాధర్ తిలక్. వారిని జాతీయోద్యమం వైపు నడిపించడం కోసం ‘గణపతి బొప్పా మోరియా’ నినాదం మొదలుపెట్టాడు. ఈ విషయాన్ని త్రివిక్రమ్ తన ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు.