జ్వాలారెడ్డిగా తమన్నా

జ్వాలారెడ్డిగా తమన్నా

Updated On : December 22, 2020 / 12:43 PM IST
గోపీచంద్‌ హీరోగా కబడ్డీ ఆట నేపధ్యంలో రూపుదిద్దుకొంటున్న సినిమా ‘సీటీమార్‌’. ఈ సినిమాలో తెలంగాణ ఫిమేల్‌ కబడ్డీ టీమ్‌ కోచ్‌ జ్వాలారెడ్డిగా తమన్నా నటిస్తున్నారు. సంపత్‌నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో గోపీచంద్, తమన్నా తొలిసారి కలిసి నటిస్తోండగా.. ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
ఈ సినిమాలో తమన్నాకు సంబంధించిన లుక్‌ను లేటెస్ట్‌గా చిత్రయూనిట్ విడుదల చేసింది. శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌, అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందుతోన్న ఈ  సినిమాలో తమన్నా తెలంగాణ కబడ్డీ టీమ్ కోచ్ జ్వాలారెడ్డిగా న‌టిస్తున్నారు. తాజాగా విడుదలైన తమన్నా లుక్‌పై ప్రశంసలు వస్తుండగా.. లుక్‌లోనే తమన్నా క్యారెక్డర్ సీరియస్‌గా సినిమాలో ఉంటుదనిపిస్తుంది.
కరోనా కారణంగా గ్యాప్ తర్వాత సెట్స్ మీదకు వచ్చిన సీటీమార్ షూటింగ్ శరవేగంగా సాగుతుంది. కరోనా సమయంలో తమన్నాకు కోవిడ్-19 కూడా సోకిన సంగతి తెలిసిందే. చికిత్స తర్వాత సురక్షితంగా బయటపడిన ఆమె.. విశ్రాంతి తీసుకుని ఇప్పుడు మళ్లీ షూటింగ్‌లలో బిజీ అవుతుంది. తమన్నా.. ప్రస్తుతం ‘గుర్తుందా శీతాకాలంలో’ సినిమాలో కూడా కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా ఓ కన్నడ సినిమాకు రీమేక్‌.