Tamannaah: రొమాన్స్ కి నో చెప్పానని అవమానించాడు.. అందరి ముందే అలా.. స్టార్ హీరోపై తమన్నా హాట్ కామెంట్స్
తనతో రొమాన్స్ చేయడానికి ఒప్పుకోలేదని స్టార్ హీరో తమన్నా(Tamannaah)ని అందరిముందే అవమానించాడట.
Tamannaah made shocking comments about the star hero.
- తమన్నాని అవమానించిన స్టార్ హీరో
- తనతో రొమాన్స్ కి నో చెప్పిందని మండిపడ్డ హీరో
- చేదు అనుభవాన్ని గుర్తుచేసుకున్న తమన్నా
Tamannaah: సినిమా ఇండస్ట్రీ0.. అందులో హీరోలు, హీరోయిన్స్ లైఫ్ మనకు బయటకు కనిపించినంత ఈజీగా ఉండదు. వాళ్ళకి ఉండాల్సిన బాధలు, కష్టాలు వాళ్ళకీ ఉంటాయి. ఈమధ్య కాలంలో వాటి గురించి కొంతమంది ఓపెన్ గా చెప్పుకుంటున్నారు. తమకు ఎదురైనా చేదు అనుభవాలను గుర్తు చేసుకుంటున్నారు. తాజాగా ఆ లిస్టులో మిల్కీ మ్యూట్ తమన్నా(Tamannaah) చేరింది. కెరీర్ బిగినింగ్ లో ఆమెకు జరిగిన అవమానమ్ గురించి చెప్తూ ఎమోషనల్ అయ్యింది.
రీసెంట్ గా ఈ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఆ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ఒక స్టార్ హీరో తనను అందరి ముందు అవమానించిన విషయాన్నీ చెప్పింది. “కెరీర్ స్టార్టింగ్ లో నేను ఒక స్టార్ హీరోతో సినిమా చేశాను. ఆరోజు ఒక రొమాంటిక్ సీన్ చేయాల్సి వచ్చింది. కానీ, అది మరీ ఇంటిమిసీగా ఉండటం వల్ల చేయనని చెప్పాను. అది నాకు కంఫర్ట్ గా లేదు అని చెప్పాను.
Riddhi Kumar: నడుమందాలు చూపిస్తూ నాజూకు నగుమోముతో.. రిద్ది కుమార్ ఫొటోస్
దానికి, ఆ హీరో అందరిముందే నాపై అరిచాడు. హీరోయిన్ ని మార్చేయండని గోల చేశాడు. అందరి ముందు అలా అనేసరికి చాలా అవమానంగా అనిపించింది. తరువాతి రోజు ఆ హీరో నాదగ్గరకు వచ్చి సారీ చెప్పాడు” అంటూ చెప్పుకొచ్చింది తమన్నా. అయితే, తనను అవమానించిన ఆ హీరో ఎవరు, ఏ ఇండస్ట్రీ నుంచి అనేది మాత్రం చెప్పలేదు తమన్నా. దీంతో, తమన్నా చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.
అలాగే ఆ హీరో ఎవరై ఉంటారు అంటూ సెర్చింగ్ మొదలుపెట్టారు నెటిజన్స్. ఇక సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం ఆమె బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ తో ఓ రోమియో అనే సినిమా చేస్తోంది. దాదాపు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, తెలుగులో ఈ అమ్మడుకు ఒక్క సినిమా అవకాశం కూడా లేకపోవడం విశేషం.
