Tamannaah : మిల్కీబ్యూటీ ‘మాస్టర్ చెఫ్’.. వీడియో వైరల్..

తెలుగు వంటకాలను ప్రపంచానికి తెలియజేసేలా డిజైన్ చేసిన ఈ షో ప్రోమోలో తమన్నా హాట్ లుక్‌లో దర్శనమిచ్చింది..

Tamannaah : మిల్కీబ్యూటీ ‘మాస్టర్ చెఫ్’.. వీడియో వైరల్..

Tamannaah

Updated On : August 6, 2021 / 5:10 PM IST

Tamannaah: మిల్కీబ్యూటీ తమన్నా వచ్చిన ఆఫర్లను అందిపుచ్చుకుంటూ.. కొత్త ప్రయత్నాలు చేస్తూ సక్సెస్ ఫుల్‌గా కెరీర్ లీడ్ చేస్తోంది.. అంతే కాకుండా ఓటీటీల్లో ఆమెకు మంచి క్రేజ్ ఉంది. ‘లెవెంత్ అవర్’, ‘ట్రూత్ తమన్నా’ వంటి వెబ్ సీరీస్‌లో లీడ్ రోల్స్ చేసి ఆకట్టుకుని ఓటీటీల్లో లేడీ ఓరియంట్ సినిమాలకు బెస్ట్ ఆప్షన్‌గా మారింది తమన్నా.

Tamannaah : ‘లెవన్త్ అవర్’.. తమన్నా రెమ్యునరేషన్ ఎంతంటే!..

విదేశాల్లో పాపులర్ అయిన ‘మాస్టర్ చెఫ్’ షో ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చేస్తోంది. ఈ షోను తెలుగు, తమిళ్, కన్నడ, మళయాలం భాషల్లో.. సౌత్ సూపర్ స్టార్లతో రూపొందించేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు నిర్వాహకులు. తమిళ వెర్షన్‌కు హోస్ట్‌గా ‘మక్కల్ సెల్వన్’ విజయ్‌సేతుపతిని ఎంచుకున్నారు. మలయాళంలో పృథ్వీ రాజ్‌.. కన్నడలో సుదీప్‌.. తెలుగులో తమన్నా హోస్ట్‌చేస్తున్నారు.

గ్లామర్ గ్రాము కూడా తగ్గలేదంటున్న తమన్నా

రీసెంట్‌గా ‘మాస్టర్ చెఫ్’ ప్రోమో రిలీజ్ చేశారు. తెలుగు వంటకాలను ప్రపంచానికి తెలియజేసేలా డిజైన్ చేసిన ఈ షో ప్రోమోలో తమన్నా హాట్ లుక్‌లో దర్శనమిచ్చింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మాస్ మహారాజా రవితేజ గెస్టులుగా వస్తారని తెలుస్తోంది. 20 ఎపిసోడ్లతో రూపొందుతున్న ఈ ప్రోగ్రామ్ కోసం తమన్నా ఒక్క ఎపిసోడ్‌కి 7 లక్షలు రెమ్యునరేషన్ తీసుకుంటుందట.

Folk Songs : ‘సారంగ దరియా’ నుండి ‘దిగు దిగు దిగు నాగ’ వరకు ఊపు ఊపుతున్న ఫోక్ సాంగ్స్..

సినిమాల విషయానికొస్తే.. మ్యాచో స్టార్ గోపిచంద్ – సంపత్ నంది కాంబినేషన్లో వస్తున్న కబడ్డీ బ్యాక్ డ్రాప్ మూవీ ‘సీటీ మార్’ లో తమన్నా తెలంగాణ వుమెన్ కబడ్డీ టీం కోచ్ ‘జ్వాలా రెడ్డి’ క్యారెక్టర్ చేస్తుంది. ఇప్పటికే ‘జ్వాలా రెడ్డి’ పాట విపరీతంగా వైరల్ అయ్యింది. అలాగే విక్టరీ వెంకటేష్ పక్కన ‘ఎఫ్ 2’ సీక్వెల్ ‘ఎఫ్ 3’ లోనూ నటిస్తోంది మిల్కీ బ్యూటీ.