Tamannaah says Lust Stories 2 movie is everybody watchable movie
Tamannaah – Lust Stories 2 : 2018 లో ఆడియన్స్ ముందుకు వచ్చి మంచి విజయం అందుకున్న బాలీవుడ్ మూవీ లస్ట్ స్టోరీస్. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ రాబోతుంది. జూన్ 29 నుంచి ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ లో ప్రసారం కానుంది. ఈ సినిమాలో తమన్నా, విజయ్ వర్మ, మృణాల్ ఠాకూర్, కాజోల్, నీనా గుప్తా, అమృత సుభాష్, అంగద్ బేడీ.. వంటి స్టార్ క్యాస్ట్ కనిపించబోతుంది. ఇక గత కొన్నాళ్లుగా లవ్ రూమర్స్ తో వార్తల్లో నిలుస్తున్న తమన్నా అండ్ విజయ్.. ఈ మూవీలో కలిసి నటించడం, రోమాన్స్ చేయడం అందరి దృష్టిని మరింత ఆకర్షిస్తుంది.
అయితే తమన్నా, మృణాల్, కాజోల్ వంటి హీరోయిన్స్ ని ఇలాంటి అడల్ట్ మూవీస్ చూడడం వారి అభిమానులకు ఇబ్బందిగా ఉంది. ఇది ఇలా ఉంటే, ఈ మూవీ ప్రమోషన్స్ లో బంగంగా తమన్నా షేర్ చేసిన ఒక వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఆ వీడియోలో తమన్నా, విజయ్ తో కలిసి ఘాటు రొమాన్స్ చేస్తూ కనబడుతుంది. అయితే ఇంతలోనే ఆ వీడియో ఆగిపోయి మరో ఫ్రేమ్ లోకి వెళ్తుంది. అప్పుడు తమన్నా ఇలా చెప్పుకొచ్చింది. “లస్ట్ స్టోరీస్ చూస్తుంటే ఎవరన్నా ఏమన్నా అనుకుంటారా? అని బయపడకండి. దీనిలో లస్ట్ ఎలా ఉందో అలాగే డ్రామా, యాక్షన్ తో పాటు అమ్మ, బామ్మ, బ్రదర్, లవర్, పనిమనిషి చూపించే ప్రేమ కూడా ఉంది. కాబట్టి లస్ట్ అనే పేరు చూసి మోసపోకండి. ఈ సినిమా చూడడానికి ఏమి బయపడకండి” అంటూ పేర్కొంది.
Maa ka, dadi ka, ex ka… sabka pyaar lekar aa rahe hai hum with #LustStories2 ?
Coming to @NetflixIndia , on 29th June! #LustStories2OnNetflix pic.twitter.com/cSlz3yycvv— Tamannaah Bhatia (@tamannaahspeaks) June 27, 2023
ఇక ఈ వీడియో చూసిన నెటిజెన్లు సరదా కామెంట్స్ చేస్తున్నారు. అయితే సౌత్ ఆడియన్స్ మాత్రం తమన్నా పై ఫైర్ అవుతున్నారు. అసలు ఏమైంది నీకు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇటీవల ‘జీ కర్దా’ సిరీస్ లో కూడా శృతిమించిన రొమాన్స్ చేయడం ఆమె అభిమానులను బాధిస్తుంది. తమన్నా మాత్రం ట్రెండ్ కి తగ్గట్టు మనం కూడా మారాలంటూ చెప్పుకొస్తుంది.