Master Chef: సౌతిండియాలో మాస్టర్ చెఫ్ షో.. మూడు భాషల్లో స్టార్ హీరోలతో.. తెలుగులో తమన్నాతో..!!
విదేశాల్లో పాపులర్ షో మాస్టర్ చెఫ్ ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చేస్తోంది. ఈ షోను తెలుగు, తమిళ్, కన్నడ, మళయాలం భాషల్లో రూపొందించేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు నిర్వాహకులు.

Tamannaah To Host Master Chef Telugu Version
Master Chef Telugu version: విదేశాల్లో పాపులర్ షో మాస్టర్ చెఫ్ ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చేస్తోంది. ఈ షోను తెలుగు, తమిళ్, కన్నడ, మళయాలం భాషల్లో రూపొందించేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు నిర్వాహకులు. ఇందుకోసం సౌత్ సూపర్ స్టార్లను తీసుకుంటోన్న షో నిర్వహకులు.. ఈ షో తమిళ వెర్షన్‌కు హోస్ట్‌గా స్టార్ విజయ్ సేతుపతిని ఎంచుకున్నారు. మలయాళంలో పృథ్వీరాజ్ హోస్ట్‌గా.. కన్నడలో సుధీప్ హోస్ట్‌గా చేస్తుండగా.. తెలుగులో మాత్రం తమన్నాను హోస్ట్‌గా తీసుకున్నారు.
త్వరలోనే ఈ కాంబినేషన్స్‌కు సంబంధించి టీజర్లు విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మాస్టర్ చెఫ్ నిర్వహకులు. ఇప్పటికే విదేశాల నుంచి వచ్చిన బిగ్‌బాస్ వంటి షోస్ ఇండియాలో ఆధరణ పొందగా.. ఈ షో కూడా మంచి రెస్పాన్స్ వస్తుందని అంటున్నారు. అయితే, మిగిలిన భాషల్లో స్టార్ హీరోలను పెట్టి, తెలుగులో మాత్రం హీరోయిన్‌ని పెట్టడంపై కాస్త పెదవి విరుస్తున్నారు నెటిజన్లు. మీడియం రేంజ్ హీరో కూడా దొరకలేదా? అని కామెంట్ చేస్తున్నారు.
ఈ షో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనే వివరాలను ప్రకటించనప్పటికీ, ఈ షో మొత్తం 13వారాల పాటు సందడి చేస్తుందని, 26ఎపిసోడ్స్ ఉంటాయని, 15మంది కంటెస్టెంట్స్ ఇందులో పాల్గొననున్నట్లు చెబుతున్నారు. ప్రతీ శని, ఆదివారాల్లో రాత్ర 9గంటల నుంచి 10గంటల వరకు ఈ షో ప్రసారం అయ్యే అవకాశం ఉంది. ఈ కార్యక్రమానికి ముగ్గురు చెఫ్‌లు జడ్జ్‌లుగా వ్యవహరిస్తారు.
Shiny queen to host master chef in Gemini tv…… coming soon @CutieRoopa@geminitv @tamannaahspeaks pic.twitter.com/r6SNprQIBp
— ༼????? ?????༽ (@CutieRoopa) June 25, 2021