కపిల్ దేవ్ బయోపిక్ : బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన జీవా

కబీర్ ఖాన్ దర్శకత్వంలో లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ బయోపిక్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో కపిల్ దేవ్ పాత్రలో రణవీర్ సింగ్ నటిస్తున్నాడు. ప్రముఖ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ ఈ చిత్రంలో రణ్ వీర్ సింగ్‌కి కోచ్ గా నటించనున్నారు.
ఇక ఈ సినిమాలో కృష్ణమాచారి శ్రీకాంత్ పాత్రలో ముందుగా విజయ్ దేవరకొండని తీసుకోవాలనుకున్నప్పటికి, ఆయన డేట్స్ కేటాయించకపోవడం వలన జీవాని ఎంపిక చేశారని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే జీవా ఈ బయోపిక్ లో శ్రీకాంత్ పాత్రలో నటించనున్నాడు. కొద్ది రోజులుగా సరైన సక్సెస్‌లు లేక ఇబ్బందిపడుతున్న జీవాకి ఈ చిత్రం మంచి సక్సెస్ ఇస్తుందేమో చూద్దాం.
1983 వరల్డ్‌కప్ ఫైనల్లో అప్పటి డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్‌ను ఓడించి తొలిసారి టీమిండియా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఆ టీమ్ సక్సెస్ స్టోరీ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. హిందీ, తెలుగుతో పాటు పలు భాషలలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. 2020లో ఏప్రిల్ 10 గుడ్ ఫ్రైడే రోజు కపిల్ దేవ్ బయోపిక్ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.