గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హీరోయిన్.. కారణం ఇదే

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హీరోయిన్.. కారణం ఇదే

Actress Raiza Wilson

Updated On : April 19, 2021 / 10:50 AM IST

Actress Raiza Wilson: గ్లామరస్ ప్రపంచంలో ఎంత అందంగా ఉంటే అన్ని అవకాశాలు.. ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. అందుకే.. అందానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంటారు సినిమా వాళ్లు.. ముఖ్యంగా హీరోయిన్లు.. అటువంటి సినిమా ప్రపంచంలో ఓ హీరోయిన్‌గా రాణిస్తున్న రైజా విల్సన్‌ ముఖాన్ని గుర్తుపట్టలేనంతగా మార్చేసింది ఓ డాక్టర్.. ఫేషియల్‌కు వెళ్లిన రైజా విల్సన్‌ ముఖ సౌందర్యాన్ని రెట్టింపు చేయడం కాదు కదా? ఉన్న సహజత్వాన్ని నాశనం చేసి ముఖాన్ని గుర్తుపట్టలేనంతగా మార్చేసింది.

 

View this post on Instagram

 

A post shared by Raiza Wilson (@raizawilson)


తమిళ బిగ్‌బాస్‌ ఫేమ్‌, `ప్యార్‌ ప్రేమ కాదల్‌` హీరోయిన్‌ రైజా విల్సన్‌.. మహిళా డాక్టర్‌ భైరవి దగ్గరకు ఫేషియల్ చేయించుకునేందుకు వెళ్లగా.. చర్మానికి కొత్త నిగారింపుని, మరింత అందాన్ని తీసుకొస్తానని చెప్పి ముఖంపై చర్మ చికిత్స చేసింది. అది కాస్త వికటించి కన్ను వాచిపోయి.. ఫేస్‌ మారిపోయి.. నలుపురంగులో అందవికారంగా కనిపిస్తుంది. ఈ క్రమంలో ఆమె తీసుకున్న ఫోటోను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది.

`నాకు అవసరం లేకపోయినా డాక్టర్‌ భైరవి‌ నాకేదో ట్రై చేసింది. చివరికి ఫలితం ఇలా వచ్చింది. దీని గురించి నిలదీద్దాం అంటే ఆమె నాతో మాట్లాడటానికి, కలవడానికి ఒప్పుకోవట్లేదు. హాస్పిటల్ స్టాఫ్‌ని అడిగితే, ఆమె అసలు నగరంలోనే లేదని అంటున్నారు` అంటూ ఓ ఫొటోను ఇన్‌స్టా స్టోరీలో పెట్టారు. `డా.భైరవి తన దగ్గరకు వచ్చే కస్టమర్లపై వారికి ఇష్టం ఉన్నా లేకపోయినా బలవంతంగా ప్రయోగాలు చేస్తుంది` అంటూ పలువురు మోసపోయిన వారి వివరాలను కూడా పోస్ట్ చేశారు రైజా. ప్రస్తుతం నాలుగు చిత్రాల్లో నటిస్తున్న రైజాకు పెద్ద కష్టమే వచ్చిందని అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు.