బిగ్ బాస్ హౌస్ లో నటి ఆత్మహత్యాయత్నం

  • Published By: Mahesh ,Published On : August 19, 2019 / 02:28 PM IST
బిగ్ బాస్ హౌస్ లో నటి ఆత్మహత్యాయత్నం

Updated On : August 19, 2019 / 2:28 PM IST

చెన్నై : తమిళ బిగ్‌బాస్‌ హౌస్‌ లో పోటీ చేస్తున్న హాస్య నటి మధుమిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తమిళంలో ఒరు కల్‌ ఒరు కన్నాడీ చిత్రంలో హాస్య పాత్రలో నటించిన మధుమిత బిగ్‌బాస్‌ సీజన్‌ 3లో పోటీ చేస్తున్నారు.

50 రోజులకు పైగా బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉన్న మధుమిత, కెప్టెన్‌ బాధ్యతలను నిర్వహిస్తున్న తరుణంలో శనివారం ఆగస్టు17న ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దీంతో ఆమెను బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి బయటకు పంపేశారు.

తమిళ బిగ్‌బాస్‌ సీజన్‌కు కమల్‌ హాసన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఆయన పాల్గొన్న గత రెండు సీజన్లలో కూడా వివాదాస్పద ఘటనలు జరిగాయి. అయితే హౌస్‌ సభ్యుల వేధింపుల కారణంగానే తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు మధుమిత తెలిపింది. గ్రామ వాలంటీర్ల ఐడీ కార్డులు సిధ్ధం