Lyca Prodictions : పెద్ద నిర్మాణ సంస్థ.. నిండా ముంచేసిన డైరెక్టర్స్.. నిలబెడదాం అంటే వేరే స్టార్స్ వల్ల కూడా అవ్వట్లా..
లైకా ప్రొడక్షన్స్.. సౌత్ ఇండియాలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్.

Tamil Biggest Production House Lyca Productions Ready to Shut Down Due to Losses Rumors goes Viral
Lyca Prodictions : లైకా ప్రొడక్షన్స్.. సౌత్ ఇండియాలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్. దళపతి విజయ్ తో కత్తి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ మూవీతో లైకా ప్రొడక్షన్స్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత మరెన్నో బిగ్ ప్రాజెక్ట్ లను ప్రొడ్యూస్ చేసి సక్సెస్ ఫుల్ ప్రొడక్షన్ హౌస్ గా నిలబడింది. అయితే మొదట్లో అదరగొట్టిన లైకా ప్రొడక్షన్స్ కి ఆ తర్వాత పెద్ద పెద్ద బడ్జెట్లు పెట్టి తీసిన సినిమాలేవీ వర్కవుట్ కాలేదు.
స్పెషల్లీ తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తీసిన 2 సినిమాలు లైకా ప్రొడక్షన్ పై భారీ ఎఫెక్ట్ చూపించాయి. దాంతో అసలు లైకా ఉనికి డౌట్ లో పడిందంటూ తమిళ్ మీడియా రూమర్స్. కోలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ శంకర్ తీసిన సినిమాలు లైకాను కొట్టిన దెబ్బ అలాంటి ఇలాంటిది కాదు. శంకర్, లైకా కాంబోలో 2018లో టేకప్ చేసిన ఫస్ట్ ప్రాజెక్ట్ రోబో 2.0 మూవీ. అది బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయింది. ఫస్ట్ పార్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో సెకండ్ పార్ట్ మీద బాగా ఖర్చుపెట్టారు. ఏకంగా 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో తీసిన మూవీ లైకాను నిండా ముంచేసింది.
Also See : నవదీప్, దీక్షిత్ టచ్ మీ నాట్ సిరీస్ ట్రైలర్ చూశారా? ఇదేదో ఇంట్రెస్టింగ్ గా ఉందే..
రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్ ఉన్నా పెట్టిన బడ్జెట్ కలెక్ట్ చేసినా డిస్ట్రిబ్యూటర్స్ కి లాస్ రావడంతో నిర్మాణ సంస్థకు భారీ నష్టం నెలకొంది. ఆ నష్టాలు మరిచిపోకముందే శంకర్ తీసిర మరో సీక్వెల్ భారతీయుడు 2తో పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయింది. విపరీతంగా డిలే అవ్వడంతో పాటు బడ్జెట్ హద్దులు దాటిపోయింది. రిలీజ్ తర్వాత ఇండియన్-2 బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ టాక్ మూటగట్టుకుంది. దీంతో ఇండియన్-3 ఆగిపోయిందని, అసలు ఈ సినిమా చెయ్యడానికి బడ్జెట్ కష్టాలు వెంటాడుతున్నాయని టాక్.
ఈ ప్రాజెక్ట్ కంటే ముందు లైకా నుంచి వచ్చిన రజినీకాంత్ లాల్ సలామ్, అజిత్ లేటెస్ట్ రిలీజ్ విడాముయర్చి కూడా లైకా కొంప ముంచేశాయి. విడాముయర్చి అయితే ఓ హాలీవుడ్ మూవీని కాపీ కొట్టి తీసిన సినిమా కావడం, నిర్మాణ సంస్థ కాపీ రైట్ కేసు వేయడంతో సెటిల్మెంట్ కోసం భారీగా డబ్బులు చెల్లించాల్సి వచ్చింది. ఈ సినిమా సైతం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది.
అటు చూస్తే హీరోలు సూపర్ స్టార్స్, ఇటు స్టార్ డైరెక్టర్స్ అయినా కూడా లైకా టేకప్ చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ డిజాస్టర్స్ గా నిలిచాయి. వరుస ఫెయిల్యూర్స్ తోనే సినిమాల ప్రొడక్షన్ నుంచి తప్పుకోవాలనే ఆలోచనలో లైకా అధినేత సుభాస్కరన్ ఉన్నారంటూ సోషల్ మీడియాలో రూమర్స్ బాగా వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం చేతిలో ఉన్న లూసిఫర్ 2, సందీప్ కిషన్ హీరోగా తమిళ్ స్టార్ హీరో విజయ్ కొడుకు జేసన్ సంజయ్ ని డైరక్టర్ గా ఇంట్రడ్యూస్ చేస్తున్న సినిమా, మరి కొన్ని సినిమాలు పూర్తయ్యాక సినిమాల నుంచి లైకా తప్పుకోవాలని చూస్తుందట. చూడాలి మరి బిజినెస్ లలో బాగా సక్సెస్ అయిన లైకా సినిమాల్లో మాత్రం నష్టాలే చూస్తుంది.