Karna Teaser : విక్రమ్ ‘కర్ణ’ టీజర్ రిలీజ్.. కురుక్షేత్రంలో యుద్ధ సన్నివేశంతో..

తమిళ్ స్టార్ హీరో విక్రమ్ కర్ణుడిగా కనిపిస్తూ చేస్తున్న సినిమా 'కర్ణ'. రీసెంట్ గా మేకర్స్ ఆ మూవీకి సంబంధించిన టీజర్ ని రిలీజ్ చేశారు.

Karna Teaser : విక్రమ్ ‘కర్ణ’ టీజర్ రిలీజ్.. కురుక్షేత్రంలో యుద్ధ సన్నివేశంతో..

Tamil star actor Vikram Karna Movie teaser release

Updated On : September 24, 2023 / 9:41 PM IST

Karna Teaser : తమిళ్ స్టార్ హీరో విక్రమ్ (Vikram).. వరుస సినిమాలను సిద్ధం చేస్తూ ఫ్యాన్స్ ని ఖుషి చేస్తున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే పొన్నియిన్ సెల్వన్ 2 సినిమాతో ఆడియన్స్ ని పలకరించాడు. త్వరలో తంగలాన్ (Thangalaan) మూవీ కూడా రిలీజ్ కానుంది. ఇక ఇటీవల ‘ధృవ నక్షత్రం’ (Dhruva Natchathiram) సినిమాని కూడా రిలీజ్ కి సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించాడు. తాజాగా ఇప్పుడు మరో సినిమా టీజర్ ని అభిమానుల ముందుకు తీసుకు వచ్చి సర్‌ప్రైజ్ చేశాడు. విక్రమ్ ‘కర్ణ’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Allu Arjun : నువ్వు అంటే నాకు పిచ్చి అంటున్న అల్లు అర్జున్.. ఇంతకీ ఆ పిచ్చి ఎవరి మీద..?

ఈ మూవీ షూటింగ్ సైలెంట్ గా జరుగుతూ ముందుకు సాగుతూ వెళ్తుందని సమాచారం. 2017లోనే ఈ మూవీని అనౌన్స్ చేశారు. అయితే ఆ తరువాత ఈ మూవీ వార్త మళ్ళీ వినిపించలేదు. రెండు రోజులు క్రిందట ఈ మూవీ షూటింగ్ జరుగుతుందని దర్శకుడు సోషల్ మీడియాలో పోస్ట్ వేశాడు. మహాభారతంలోని కర్ణుడి పాత్రతో ఈ సినిమా తెరకెక్కుతుంది. తాజాగా నేడు ఒక టీజర్ ని రిలీజ్ చేశారు. కురుక్షేత్రంలో యుద్ధ సన్నివేశంతో ఈ టీజర్ ని రిలీజ్ చేశారు. ఒకసారి ఆ టీజర్ ని మీరుకూడా చూసేయండి.

Kangana Ranaut : రామ్ చరణ్‌కి పెద్ద అభిమానిని అంటున్న కంగనా.. తన సినిమాలు అంటే..

కర్ణుడిగా విక్రమ్ లుక్స్ ఆకట్టుకున్నాయి. టీజర్ లోని షాట్స్ కూడా ఆకట్టుకున్నాయి. ఆర్ ఎస్ విమల్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో ఇతర పాత్రల్లో ఈ యాక్టర్స్ నటిస్తున్నారు అనేదాని పై ఆసక్తి నెలకుంది. కేవలం తమిళ స్టార్స్ మాత్రమే కనిపించబోతున్నారా..? లేక ఇతర పరిశ్రమకి చెందిన నటీనటులు కూడా కనిపిస్తారా..? అనేది తెలియాల్సి ఉంది. పాన్ ఇండియా చిత్రంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. 3D వెర్షన్ లో ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రాబోతుంది.