Tammareddy Bharadwaj Comments on ssmb29 business
Mahesh – Rajamouli : దర్శకదీరుడు రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు ఓ సినిమాలో నటించనున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ కోసం సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ మూవీ నుంచి ఏ చిన్న అప్‌డేట్ వచ్చినా కాని అది క్షణాల్లో వైరల్‌గా మారిపోతుంది. ఇక టాలీవుడ్ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఈ చిత్రం గురించి మాట్లాడారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.
మహేశ్, రాజమౌళి కాంబినేషన్‌లో రానున్న మూవీ బడ్జెట్ ఖచ్చితంగా రూ.1000 కోట్లు దాటవచ్చునని అభిప్రాయ పడ్డారు. ఈ చిత్రంలో అంతర్జాతీయ ఆర్టిస్టులు నటించనున్నట్లు తెలిపారు. ఇక ఈ చిత్ర బిజినెస్ రూ.2000 కోట్లు దాటొచ్చునని టీమ్ భావిస్తోందన్నారు.
Tollywood Stars : మాల్దీవ్స్ లో ఎంజాయ్ చేసిన టాలీవుడ్ స్టార్స్.. ఈ వీడియో చూసారా..?
అంతకు మించి ఈ చిత్రం వసూలు చేస్తుందని, అది రూ.3వేలు, రూ.4వేల కోట్ల వరకు ఉండొచ్చునని చెప్పారు. ఒకవేళ అదేగనుక జరిగితే తెలుగులోనే కాదు భారతదేశ సినీరంగంలోనే చరిత్ర అవుతుందని చెప్పారు.
మొత్తంగా ఈ ప్రాజెక్ట్ బిజినెస్‌ను ఊహించడం కష్టమని చెప్పుకొచ్చారు. బాహుబలి తరువాత తెలుగు సినిమా స్థాయి పెరిగిందన్నారు. రూ.100 కోట్లు అంటే సాధారణంగా మారిపోయిందన్నారు. ఇక ఆర్ఆర్ఆర్ తరువాత రూ.300 కోట్లు చిన్న బడ్జెట్ అయిపోయిందన్నారు. ఇక మహేశ్ సినిమా విడుదల అయ్యాక రూ.500 కోట్లు సాధారణ విషయంలా కనిపించవచ్చునని అభిప్రాయపడ్డారు. ఈ సినిమా తరువాత ప్రపంచమంతా తెలుగు సినిమా గురించి మాట్లాడుకుంటుందని అన్నారు.
Lucky Baskhar : అదరగొడుతున్న ‘లక్కీ భాస్కర్’.. వంద కోట్లకు ఇంకెంత దూరమంటే?