Lucky Baskhar : అదరగొడుతున్న ‘లక్కీ భాస్కర్’.. వంద కోట్లకు ఇంకెంత దూరమంటే?
దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది దుల్కర్ సల్మాన్ నటించిన లక్కీ భాస్కర్ చిత్రం.

Lucky Baskhar Movie 11 Days Collections
Lucky Baskhar : దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది దుల్కర్ సల్మాన్ నటించిన లక్కీ భాస్కర్ చిత్రం. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తోంది. పాజిటివ్ టాక్‌తో థియేటర్ల వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. వంద కోట్ల క్లబ్‌లో చేరేందుకు చాలా దగ్గరగా ఉంది.
విడుదలైన 11 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ 96.8 కోట్లు గ్రాస్ వసూళ్లను సాధించింది. ఈ విషయాన్ని చిత్ర బృందం తెలియజేసింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ను విడుదల చేసింది.
Sahiba : విజయ్ దేవరకొండ ‘సాహిబా’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ‘కాలానికి మించి- ఒక ప్రేమకథ ఎదురుచూస్తోంది’
మరో రోజులో ఈ చిత్రం 100 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టనుంది.
మీనాక్షి చౌదరి కథానాయికగా శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య లు ఈ మూవీని నిర్మించారు. సచిన్ ఖేడేకర్, సాయికుమార్ లు కీలక పాత్రలను పోషించారు.
#LuckyBaskhar has a spectacular 2nd weekend at the box office, now gearing up to hit the prestigious 100CR+ mark! 💸💥
The 𝑴𝑬𝑮𝑨 𝑩𝑳𝑶𝑪𝑲𝑩𝑼𝑺𝑻𝑬𝑹 grossed over 𝟗𝟔.𝟖 𝐂𝐑+ in 𝟏𝟏 𝐃𝐀𝐘𝐒 Worldwide!💰🔥
Watch #BlockbusterLuckyBaskhar at Cinemas Near you – Book your… pic.twitter.com/mbb0wuCdZo
— Sithara Entertainments (@SitharaEnts) November 11, 2024