Tarun Bhaskar : టాలీవుడ్ యువ దర్శకుడికి కరోనా

“పెళ్లి చూపులు”, “ఈ నగరానికి ఏమైంది” లాంటి సూపర్ హిట్ సినిమాలు అందించిన డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ప్రస్తుతం కరోనా బారిన పడ్డారు. ఈ విషయం ఆయన తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Tarun Bhaskar :  టాలీవుడ్ యువ దర్శకుడికి కరోనా

Tarun Bhaskar

Updated On : January 21, 2022 / 11:25 AM IST

Tarun Bhaskar :   ప్రస్తుతం రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ సారి చాలా మంది సెలబ్రిటీలు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్, తమిళ్, తెలుగు, మలయాళ స్టార్లు చాలా మంది కరోనా బారిన పడ్డారు. రోజూ ఎవరో ఒక సెలబ్రిటీ కరోనా బారిన పడుతూనే ఉన్నారు. తాజాగా టాలీవుడ్ లో మరో యువ దర్శకుడు కరోనా బారిన పడ్డారు.

Samantha : విడాకుల పోస్ట్ డిలీట్ చేసిన సమంత

“పెళ్లి చూపులు”, “ఈ నగరానికి ఏమైంది” లాంటి సూపర్ హిట్ సినిమాలు అందించిన డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ప్రస్తుతం కరోనా బారిన పడ్డారు. ఈ విషయం ఆయన తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ” హలో ఫ్రెండ్స్ నాకు కోవిడ్ వచ్చింది. రెస్ట్ తీసుకుంటున్నాను. కోవిడ్ ని సీరియస్ గా తీసుకోండి ఫ్రెండ్స్” అని పోస్ట్ చేశారు. ప్రస్తుతం తరుణ్ భాస్కర్ తన మూడో సినిమాని తెరకెక్కించే ప్రయత్నాల్లో ఉన్నారు.