Tarun Bhaskar : నాకు ఫ్లాప్స్ వస్తే విజయ్ దేవరకొండని వాడుకుంటాను

విజయ్‌తో మళ్లీ సినిమా చేసే అవకాశం ఉందా అని ఆలీ అడగగా.. దీనికి తరుణ్ సమాధానమిస్తూ.. విజయ్ నాకు వైల్డ్ కార్డు లాంటి వాడు. ఒకవేళ నా అదృష్టం బాగోక.............

Tarun Bhaskar : నాకు ఫ్లాప్స్ వస్తే విజయ్ దేవరకొండని వాడుకుంటాను

Vijay Devarakonda

Updated On : May 25, 2022 / 7:54 AM IST

Tarun Bhaskar :  పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది లాంటి సూపర్ హిట్ సినిమాలతో డైరెక్టర్ గా, మీకు మాత్రమే చెప్తా సినిమాతో నటుడిగా మెప్పించిన తరుణ్ భాస్కర్ ఆ తర్వాత యాంకర్ గా, సింగర్ గా, ఎడిటర్ గా కూడా ప్రేక్షకులని అలరించాడు. విశ్వక్సేన్, విజయదేవరకొండ.. వీళ్ళిద్దర్నీ స్టార్ హీరోలని చేసింది తరుణ్ భాస్కరే. ప్రస్తుతం పలు సినిమాలకి రచయితగా పని చేస్తూ తన నెక్స్ట్ సినిమా ప్లాన్ లో ఉన్నాడు తరుణ్. తాజాగా ఆలీతో సరదాగా ప్రోగ్రాంకి తరుణ్ వచ్చాడు. ఈ ప్రోగ్రాం ప్రోమోని విడుదల చేయగా ఇందులో పలు ఆసక్తికర షయాలని తెలియచేశాడు.

 

విజయ్‌తో మళ్లీ సినిమా చేసే అవకాశం ఉందా అని ఆలీ అడగగా.. దీనికి తరుణ్ సమాధానమిస్తూ.. విజయ్ నాకు వైల్డ్ కార్డు లాంటి వాడు. ఒకవేళ నా అదృష్టం బాగోక నాకు వరసగా మూడు ఫ్లాప్స్ వస్తే అప్పుడు విజయ్ దేవరకొండని వాడుకుంటాను అని తెలిపాడు. అప్పుడు కచ్చితంగా విజయ్ తో సినిమా తీస్తాను అని అన్నాడు.

Chaitra : నన్ను హింసించాడు.. నా భర్త నుంచి ప్రాణహాని ఉంది.. పోలీసులకి ఫిర్యాదు చేసిన నటి..

ఇక తన చదువు గురించి చెప్తూ చదువులో బ్యాక్ బెంచర్ అని, ఇంజనీరింగ్ లో తనకి 23 సప్లీలు ఉన్నాయని, తాను కట్టిన సప్లీ ఫీజులతో కాలేజీ వాళ్ళు ఇంకో బిల్డింగ్ కట్టొచ్చు అని, మాల్యా కూతురు పెళ్ళికి వెళ్లి దీపికా పదుకొనే ఫోటోలు తీశాను అని తన లైఫ్ లో జరిగిన పలు ఆసక్తికర విషయాలని ఆలీతో పంచుకున్నాడు. త్వరలోనే ఫుల్ ఇంటర్వ్యూ రిలీజ్ అవ్వనుంది.