Hanuman : రిలీజ్‌ని వెనక్కి తీసుకు వెళ్తున్న హనుమాన్.. కారణం ఆదిపురుష్?

హనుమాన్ సినిమా రిలీజ్ ని వాయిదా వేస్తూ మూవీ టీం అనౌన్స్ చేసింది. అయితే ఈ వాయిదాకి కారణం ప్రభాస్ ఆదిపురుష్..

Hanuman : రిలీజ్‌ని వెనక్కి తీసుకు వెళ్తున్న హనుమాన్.. కారణం ఆదిపురుష్?

Teja Sajja Hanuman release postponed due to post production works

Updated On : May 5, 2023 / 3:36 PM IST

Hanuman : టాలీవుడ్ లో మూడు సినిమాలతోనే ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prasanth Varma). ఇక చైల్డ్ ఆర్టిస్ట్ గా తెలుగు ప్రేక్షకులను చిన్నతనం నుంచే అలరిస్తూ వస్తున్న నటుడు తేజ సజ్జ (Teja Sajja). వీరిద్దరి కలయికలో వచ్చిన ‘జాంబీ రెడ్డి’ మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా తరువాత వీరిద్దరూ కలిసి చేసిన సినిమా ‘హనుమాన్’. శ్రీరామ భక్తుడు హనుమంతుడిని సూపర్ హీరోగా పరిచయం చేస్తూ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.

Adipurush : ఆదిపురుష్ ట్రైలర్ రిలీజ్‌కి రంగం సిద్ధం.. స్పెషల్ స్క్రీనింగ్ థియేటర్ లిస్ట్ ఇదే..

ఈ మూవీ పై మొదటిలో ఎటువంటి అంచనాలు లేవు. కానీ టీజర్ రిలీజ్ అయ్యాక సినిమా అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. టీజర్ లోని షాట్స్, టేకింగ్ అండ్ యాక్షన్ సీక్వెన్స్ అందర్నీ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా టీజర్ లోని గ్రాఫిక్స్ కి ఆడియన్స్ ఫిదా అయ్యిపోయారు. ఇక ఈ చిత్రాన్ని 11 భాషల్లో మే 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తామంటూ ఆల్రెడీ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజా ఈ సినిమా రిలీజ్ తేదీని వేయదు వేస్తున్నట్లు మూవీ టీం అనౌన్స్ చేసింది. కొత్త విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామంటూ చెప్పుకొచ్చారు.

HanuMan : ఇండియన్ సూపర్ హీరో వచ్చేస్తున్నాడు.. హనుమాన్ షూటింగ్ పూర్తి..

అలాగే వాయిదా వేయడానికి గల కారణం కూడా తెలియజేశారు. టీజర్ కి వచ్చిన రెస్పాన్స్ తో మూవీ పై అంచనాలు పెరిగిపోయాయి. దీంతో మూవీ టీం పై చాలా పెద్ద బాధ్యత పడిందని, ప్రేక్షకుల నమ్మకం నిలబెట్టుకునేలా సినిమాని రెడీ చేస్తున్నాము. కాబట్టి అందుకోసం కొంత సమయం కావాలని వెల్లడించారు. అయితే ఈ టీజర్ చూసిన తరువాత ప్రభాస్ ఆదిపురుష్ (Adipurush) సినిమా పై భారీ ట్రోలింగ్ జరిగింది. హనుమాన్ లోని గ్రాఫిక్స్ ని పోలుస్తూ ఆదిపురుష్ ని ట్రోల్ చేశారు. ఇప్పుడు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు రిలీజ్ ని వెనక్కి తీసుకు వెళ్తున్నట్లు అర్ధమవుతుంది.