Site icon 10TV Telugu

Mirai : తేజ స‌జ్జ ‘మిరాయ్’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ వెల్ల‌డించిన చిత్ర‌బృందం..

Teja Sajja Mirai movie release post pone new release date fix

Teja Sajja Mirai movie release post pone new release date fix

హ‌నుమాన్ మూవీతో సాలీడ్ హిట్‌ అందుకున్నాడు తేజ స‌జ్జ‌. ఈ మూవీతో పాన్ ఇండియా లెవ‌ల్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్ర‌స్తుతం తేజ న‌టిస్తున్న మూవీ మిరాయ్‌. కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యాన‌ర్ పై టీజీ విశ్వ‌ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర విడుద‌లను వాయిదా వేశారు. కాగా.. చిత్రబృందం కొత్త విడుద‌ల తేదీని ప్ర‌క‌టించింది.

వాస్త‌వానికి ఈ చిత్రాన్ని ఈ ఏడాది సమ్మ‌ర్‌లో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్న‌ట్లు గ‌తంలో చిత్ర బృందం వెల్ల‌డించింది. అయితే.. తాజాగా కొత్త విడుద‌ల తేదీని ప్ర‌క‌టించింది. ఆగ‌స్టు 1 న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌నున్న‌ట్లు తెలిపింది.

Odela 2 Teaser : కుంభ‌మేళాలో ‘ఓదెల 2’ టీజ‌ర్ రిలీజ్‌.. లేడీ అఘోరాగా త‌మ‌న్నా..

ఈ మేర‌కు ఓ స్పెష‌ల్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది. 8 భాషల్లో 2డి, 3డి ఫార్మాట్ల‌లో ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్న‌ట్లు చెప్పింది.

Chef Mantra Project K : ‘ఆహా’లో సుమ కుకింగ్ షో.. ఇక్క‌డ‌ కుకింగ్, కామెడీ, ట్విస్ట్స్ అన్ని మ‌సాలాలు ఉంటాయ్‌..

ఈ చిత్రంలో రితికా నాయ‌క్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. జగపతి బాబు, శ్రియా శరన్, జయరాం, రాజేంద్ర ప్రసాద్ లు కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. టాలీవుడ్ న‌టుడు మంచు మ‌నోజ్ విల‌న్ రోల్‌లో న‌టిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి.


మిరాయ్ అనేది అశోకుని కాలంలో ర‌హ‌స్య‌మైన ఓ శాస‌నం అని గ‌తంలో ఓ సంద‌ర్భంలో ద‌ర్శ‌కుడు కార్తీక్ చెప్పారు. సినిమా విడుద‌లైన త‌రువాత దీని గురించి అంద‌రికి పూర్తిగా అర్థ‌మ‌వుతుంద‌ని చెప్పారు.

 

Exit mobile version