Dil Raju : బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు చిన్న అంశం.. సీఎంతో మీటింగ్ తర్వాత దిల్ రాజు కామెంట్స్..

సీఎం రేవంత్ తో మీటింగ్ అనంతరం నిర్మాత, తెలంగాణ FDC చైర్మన్ దిల్ రాజు మాట్లాడుతూ..

Telangana FDC Chairman Producer Dil Raju Comments after CM Meeting

Dil Raju : నేడు సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల మీటింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మీటింగ్ కి టాలీవుడ్ నుంచి, ప్రభుత్వం నుంచి పలువురు పాల్గొన్నారు. సీఎం రేవంత్ టాలీవుడ్ ఏం చేయాలని చెప్పి అలాగే సపోర్ట్ చేస్తామన్నారు. సినీ పెద్దలు కూడా తమకేం కావాలో అడిగి ప్రభుత్వానికి సహకరిస్తామని చెప్పారు. అనేక అంశాలపై ఈ మీరింగ్ లో చర్చ జరిగింది. నిర్మాత, FDC చైర్మన్ దిల్ రాజు నేతృత్వంలో సినీ ప్రముఖులు ఈ మీటింగ్ కి వెళ్లారు.

దీంతో సీఎం రేవంత్ తో మీటింగ్ అనంతరం నిర్మాత, తెలంగాణ FDC చైర్మన్ దిల్ రాజు మాట్లాడుతూ.. సినీ పరిశ్రమ పట్ల సీఎం గారి విజన్ ను మాకు వివరించారు. తెలుగు సినీ పరిశ్రమకు అన్ని వర్గాల నుంచి అందాల్సిన గౌరవం అందుతుంది. ప్రభుత్వం – సినీ పరిశ్రమ కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్నాము అని తెలిపారు.

Also Read : Anaganaga Oka Raju : ‘అన‌గ‌న‌గా ఒక రాజు’ టీజ‌ర్ రిలీజ్‌.. న‌వీన్ పొలిశెట్టి ఈస్ బ్యాక్‌..

అలాగే.. తెలుగు సినిమాలే కాకుండా హైదరాబాద్ లో అన్ని భాషల సినిమాల షూటింగ్ లు జరగాలి. హైదరాబాద్ లో హాలీవుడ్ సినిమా షూటింగ్ లకు అనుగుణంగా వసతులు కల్పించాలని కోరాము. సీఎం గారు హైదరాబాద్ సినీ పరిశ్రమ ఒక హబ్ గా తయారు కావాలన్నారు. సానుకూల థృక్పథంతో సినీ పరిశ్రమ పనిచేయాలని చెప్పారు.

డ్రగ్స్ నివారణ విషయంలో ప్రభుత్వానికి సహకరిస్తాం. సినీ పరిశ్రమకు ప్రభుత్వానికి మధ్య గ్యాప్ ఉందనేది అపోహ మాత్రమే. సినీ పరిశ్రమకు కావాల్సిన భద్రతపై డీజీపీతో చర్చించారు. పరిశ్రమ అభివృద్ధి మాత్రమే మా లక్ష్యం. బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపు అంశం చాలా చిన్నది. ప్రభుత్వానికి, సినీ పరిశ్రమకు FDC మధ్యలో ఉంటూ ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి పరిశ్రమ అభివృద్ధి కోసం 15 రోజుల్లో కమిటీ నివేదిక తయారుచేసి ప్రభుత్వానికి అందిస్తాము అని తెలిపారు. మరి ఈ మీటింగ్ పై మిగిలిన టాలీవుడ్ ప్రముఖులు ఎవరైనా మాట్లాడతారేమో చూడాలి.

Also Read : Tollywood : సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్ లో టాలీవుడ్ ప్రముఖులు ఎవరెవరు ఏం మాట్లాడారంటే..