Gaddar Awards : తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ కీలక ప్రెస్ మీట్.. దిల్ రాజు, మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి ఆధ్వర్యంలో..
తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ ప్రధాన ఉత్సవం ఈనెల 14న హైటెక్స్ లో నిర్వహిస్తుంది.

Telangana Gaddar Film Awards Important Pressmeet by Dil Raju and Komatireddy Venkata Reddy
Gaddar Awards : గత కొన్నేళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వం తరపున ఇచ్చే నంది అవార్డులు ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఇన్నేళ్ల తర్వాత తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి నంది అవార్డులను గద్దర్ పేరిట ఇస్తామని ప్రకటించారు. ఇటీవలే 2024 సంవత్సరానికి గాను గద్దర్ అవార్డులను ప్రకటించారు. అలాగే గత పదేళ్లలో బెస్ట్ సినిమాలకు కూడా అవార్డులు ప్రకటించారు.
తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ ప్రధాన ఉత్సవం ఈనెల 14న హైటెక్స్ లో నిర్వహిస్తుంది. ఇప్పటికే విన్నర్స్ ని కూడా ప్రకటించడంతో ఈ ఈవెంట్ కోసం ఫ్యాన్స్, సినీ ప్రేక్షకులు, టాలీవుడ్ ఎదురుచూస్తుంది. అయితే దీనికి సంబంధించి నేడు కీలక ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు.
Also Read : Tollywood : సీఎంతో సినీ ప్రముఖుల భేటీ.. పవన్ తో కలిసి.. ఎప్పుడంటే..? ఏ ఏ అంశాలు చర్చించనున్నారు..?
గద్దర్ సినీ అవార్డులపై రాష్ట్ర సినిమాటోగ్రఫీ, రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి, తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు, కార్పొరేషన్ ఎండి హరీష్ లు నేడు జూన్ 12 సాయంత్రం హైదరాబాద్ లోని ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ లో ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నారు. మరి ఈ ప్రెస్ మీట్ లో ఏ అంశాలపై మాట్లాడతారో చూడాలి.