Tollywood : సీఎంతో సినీ ప్రముఖుల భేటీ.. పవన్ తో కలిసి.. ఎప్పుడంటే..? ఏ ఏ అంశాలు చర్చించనున్నారు..?
ఇక నుంచి ఏం ఉన్నా టాలీవుడ్ కి ప్రభుత్వానికి మధ్య ఫిలిం ఛాంబర్ ఉండాలని చెప్పడంతో టాలీవుడ్ లో వీటిపై చాలానే చర్చలు జరిగాయి.

Tollywood People will Meet AP CM Chandrababu Naidu with Pawan Kalyan
Tollywood : గత కొన్ని రోజులుగా థియేటర్స్ ఇష్యూ, జనాలు థియేటర్స్ కి రావట్లేదు, థియేటర్స్ బంద్, టికెట్ రేట్ల పెంపు, థియేటర్స్ లో ఫుడ్ రేట్లు, పవన్ కళ్యాణ్ టాలీవుడ్ పై, థియేటర్స్ పై సీరియస్ అవ్వడంతో ఈ అంశాలు తెగ వైరల్ అవుతున్నాయి. రోజూ ఎవరో ఒకరు నిర్మాతో, థియేటర్ ఓనర్స్ వీటిపై కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. పవన్ సీరియస్ అయి అసలు ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎంని కలిసారా అని ప్రశ్నించడం, ఇక నుంచి ఏం ఉన్నా టాలీవుడ్ కి ప్రభుత్వానికి మధ్య ఫిలిం ఛాంబర్ ఉండాలని చెప్పడంతో టాలీవుడ్ లో వీటిపై చాలానే చర్చలు జరిగాయి.
ఈ నేపథ్యంలో టాలీవుడ్ సినీ ప్రముఖులు ఈ నెల జూన్ 15న ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ కానున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలోనే ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో సా.4 గంటలకు చంద్రబాబును కలవనున్నారు. పవన్ సీరియస్ అయిన తర్వాత సినీ ప్రముఖులు ఏపీ సీఎంని పవన్ కళ్యాణ్ తో సహా కలవడం ఆసక్తికరంగా మారింది.
Also Read : Mithra Mandali : మిత్ర మండలి టీజర్.. నవ్వులే నవ్వులు..
ఈ మీటింగ్ లో థియేటర్స్ సమస్యలు, టికెట్ రేట్ల పెంపు, థియేటర్స్ లో తినుబండారాల రేట్లు, ఏపీలో సినిమా షూటింగ్స్, నంది అవార్డులు.. ఈ అంశాలన్నీ ప్రస్తావనకు రానున్నట్టు సమాచారం. ఈ భేటీకి టాలీవుడ్ లోని పెద్ద నిర్మాతలు, పలువురు దర్శకులు వెళ్లనున్నట్టు తెలుస్తుంది.