Mithra Mandali : మిత్ర మండలి టీజ‌ర్‌.. న‌వ్వులే న‌వ్వులు..

ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా లీడ్ రోల్స్‌లో న‌టిస్తున్న మూవీ మిత్ర మండలి.

Mithra Mandali : మిత్ర మండలి టీజ‌ర్‌.. న‌వ్వులే న‌వ్వులు..

Mithra Mandali Teaser out now

Updated On : June 12, 2025 / 12:50 PM IST

ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా లీడ్ రోల్స్‌లో న‌టిస్తున్న మూవీ మిత్ర మండలి. సోష‌ల్ మీడియా సంచ‌ల‌నం నిహారిక ఎన్ఎమ్ ఈ సినిమాతోనే టాలీవుడ్‌లోకి అడుగు పెడుతోంది.

ఇటీవ‌ల ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ను విడుద‌ల చేయ‌గా మంచి స్పంద‌న వ‌చ్చింది. తాజాగా ఈ చిత్ర టీజ‌ర్‌ను విడుదల చేశారు. 2 నిమిషాల 42 సెక‌న్లు నిడివితో ఉంది. ప్రియ‌ద‌ర్శి, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా లు బ్యాట్ లేకుండానే క్రికెట్ ఆడ‌డాన్ని చూడొచ్చు. టీజ‌ర్ మొత్తం కామెడీతో నిండిపోయింది.

Nikhil : ‘ది ఇండియా హౌస్’ సెట్‌లో ప్ర‌మాదం.. స్పందించిన హీరో నిఖిల్‌..

నూతన దర్శకుడు విజయేందర్ ఎస్ డైరెక్ష‌న్‌లో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. బన్నీ వాస్ సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప, డా. విజయేందర్ రెడ్డి తీగల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.