Nikhil : ‘ది ఇండియా హౌస్’ సెట్‌లో ప్ర‌మాదం.. స్పందించిన హీరో నిఖిల్‌..

ది ఇండియా హౌస్ మూవీ సెట్‌లో జ‌రిగిన ప్ర‌మాదం పై హీరో నిఖిల్ స్పందించారు.

Nikhil : ‘ది ఇండియా హౌస్’ సెట్‌లో ప్ర‌మాదం.. స్పందించిన హీరో నిఖిల్‌..

Hero nikhil response over accident at the india house set

Updated On : June 12, 2025 / 11:49 AM IST

ది ఇండియా హౌస్ మూవీ సెట్‌లో జ‌రిగిన ప్ర‌మాదం పై హీరో నిఖిల్ స్పందించారు. తామంతా క్షేమంగా ఉన్న‌ట్లు తెలిపాడు. ఖ‌రీదైన ప‌రిక‌రాల‌ను కోల్పోయిన‌ప్ప‌టికి, ఎలాంటి ప్రాణ న‌ష్టం జ‌ర‌గ‌లేద‌ని చెప్పాడు.

‘మేమంద‌రం సుర‌క్షితంగానే ఉన్నాం. ప్రేక్ష‌కుల‌కు గొప్ప సినిమాటిక్ అనుభూతిని అందించాల‌ని కొన్ని సార్లు రిస్క్ తీసుకుంటాము. ఈ స‌మ‌యంలో ఘ‌ట‌న చోటు చేసుకుంది. అయితే.. మూవీ యూనిట్ అప్ర‌మ‌త్తంగా ఉంది. వారు తీసుకున్న జాగ్ర‌త్త‌ల కార‌ణంగా పెద్ద ప్ర‌మాదం నుంచి బ‌య‌ట‌ప‌డ్డాం. అవును ఖ‌రీదైన ప‌రిక‌రాల‌ను కోల్పోయాం. అయితే.. దేవుడి ద‌య వ‌ల్ల ఎటువంటి ప్రాణ న‌ష్టం జ‌రుగ‌లేదు.’ అని నిఖిల్ సోష‌ల్ మీడియాలో రాసుకొచ్చాడు.

ది ఇండియా హౌస్ చిత్రంలో నిఖిల్ హీరోగా న‌టిస్తున్నారు. రామ్‌ వంశీకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో స‌యీ మంజ్రేక‌ర్ క‌థానాయిక‌. అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్, వి మెగా పిక్చర్స్‌ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అనుప‌మ్ ఖేర్ కీల‌క పాత్ర పోషిస్తున్న ఈ చిత్ర షూటింగ్ శంషాబాద్ స‌మీపంలో జ‌రుగుతోంది.

చిత్రీక‌ర‌ణ‌లో భాగంగా సముద్రం సీన్స్‌ తీసేందుకు ఏర్పాటు చేసిన భారీ వాటర్ ట్యాంక్ ఒక్క‌సారిగా ప‌గిలిపోయింది. దీంతో సెట్‌ను ఒక్క‌సారిగా నీళ్లు ముంచెత్తాయి. ఈ ఘ‌ట‌న‌లో ప‌లువురు సిబ్బందికి స్వ‌ల్ప గాయాలు అయ్యాయి.  కాగా.. షూటింగ్ సామాగ్రి మొత్తం నీటిలో త‌డిచింది.