Vishwak Sen: ఫీమేల్ క్యారెక్టర్ చేయాలని ఉంది.. విశ్వక్ ఇంట్రెస్టింగ్ కామెంట్!
యువ హీరో విశ్వక్ సేన్ మాస్ కా దాస్ అని పేరు తెచ్చుకొని మాస్ ఆడియన్స్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు.

Vishwak Sen
Vishwak Sen: యువ హీరో విశ్వక్ సేన్ మాస్ కా దాస్ అని పేరు తెచ్చుకొని మాస్ ఆడియన్స్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. ఇప్పుడు క్లాస్ ఆడియన్స్ ని కూడా తనవైపుకు తిప్పుకోవడానికి క్లాస్ సినిమాలు చేయడం మొదలు పెట్టాడు. విశ్వక్ గత సినిమా పాగల్ యావరేజ్ గా నిలిచింది. ప్రస్తుతం విశ్వక్ సేన్ “అశోక వనంలో అర్జున కళ్యాణం” సినిమాతో రాబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులని మెప్పించాయి.
Ashoka Vanamlo Arjuna Kalyanam: విశ్వక్ సేన్ విశ్వప్రయత్నాలు.. ఫలించేనా?
ఇప్పటికే పలు మార్లు విడుదల వాయిదా పడుతూ వస్తున్న ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ సినిమా ఫైనల్ గా మే 6న ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న విశ్వక్ ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఈ సినిమాలో తాను 30 ఏళ్ల వయసు మీద పడినా పెళ్లి కాని అల్లం అర్జున్ కుమార్ క్యారెక్టర్ లో నటిస్తున్నానని.. ఈ పాత్ర ప్రేక్షకులను మెప్పిస్తుందని విశ్వక్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
Ashoka Vanamlo Arjuna Kalyanam : ‘ఓ ఆడపిల్లా.. నువ్వర్థం కావా?..నా జీవితంతో ఆటాడుతావా?’..
ఇక, యాక్టర్‌గా తనకు విభిన్నమైన పాత్రలు చేయాలని ఉందన్న విశ్వక్.. కమల్‌హాసన్‌గారు ‘భామనే సత్యభామనే’ సినిమాలో చేసిన ఫీమేల్ క్యారెక్టర్ లాంటివి చేయాలని ఉందని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. అలాగే నేను తెలంగాణ హీరోగా మాత్రమే ఉండాలనుకోవడం లేదని.. ఇతర భాషల్లోనూ సినిమాలు చేస్తానని.. ‘మల్లీశ్వరి, నువ్వు నాకు నచ్చావ్’ లాంటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లు వచ్చి చాలా రోజులైంది. ఇప్పుడు అలాంటి ఎంటర్‌టైన్‌మెంట్‌తో ప్రేక్షకుల ముందుకొస్తున్నామని చెప్పారు.