ఇద్దరిలో ఎవరు ‘బిగ్ బాస్ 4’ హోస్ట్?
త్వరలో ప్రారంభం కానున్న ‘బిగ్ బాస్ 4’ కు మహేష్ బాబు లేదా ఎన్టీఆర్ హోస్టింగ్ చేయనున్నారని సమాచారం..

త్వరలో ప్రారంభం కానున్న ‘బిగ్ బాస్ 4’ కు మహేష్ బాబు లేదా ఎన్టీఆర్ హోస్టింగ్ చేయనున్నారని సమాచారం..
‘బిగ్ బాస్’.. తెలుగు టెలివిజన్ రంగంలో అతిపెద్ద రియాలిటీ షోగా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటి వరకు వచ్చిన మూడు సీజన్లు ప్రేక్షకులను ఆకట్టుకోగా.. త్వరలో నాలుగవ సీజన్ స్టార్ట్ కానుంది. ఫస్ట్ సీజన్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెకండ్ సీజన్‌కు నేచురల్ స్టార్ నాని, థర్డ్ సీజన్‌కు కింగ్ నాగార్జున హోస్టింగ్ చేశారు.
మరి త్వరలో ప్రారంభం కానున్న నాలుగో సీజన్‌కు హోస్ట్ ఎవరు అనే విషయం గురించి ఇప్పుడు చర్చ జరుగుతోంది. స్టార్ మాలో ప్రసారం కానున్న ‘బిగ్ బాస్’ సీజన్ 4కు సూపర్ స్టార్ మహేష్ బాబు లేదా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇద్దరిలో ఒకరు హోస్ట్‌గా వ్యవహరిస్తారని సమాచారం.
తారక్ ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత త్రివిక్రమ్‌తో సినిమా చేయనున్నాడు. మే నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది. మహేష్, మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’లో కీలకపాత్ర పోషించనున్నాడు. వంశీ పైడిపల్లి, పరశురామ్ దర్శకత్వంలోనూ మహేష్ సినిమాలు చేయనున్నాడు.
Also Read | హ్యాపీ బర్త్‌డే మిస్టర్ పర్ఫెక్షనిస్ట్.. శుభాకాంక్షలు తెలిపిన బాలీవుడ్..