ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా సినీ స్టిల్ ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులకు ఉచితంగా మందులు అందించిన బాలయ్య

NTR Memorial Trust Distributes Medicines: కోవిడ్-19తో ప్రపంచ దేశాలు అతలాకుతలం అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. వ్యాక్సిన్ కోసం అన్ని దేశాలు ఎదురుచూస్తున్నాయి. ప్రస్తుతం వ్యాక్సిన్ వచ్చేవరకు కరోనాను జయించాలంటే మనిషి రోగ నిరోధక శక్తి పెంచుకోవాల్సిందే. ఫిలిం ఇండస్ట్రీలో పనిచేసే కార్మికులకు రోగ నిరోధక శక్తి పెంచే మందులను ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఉచితంగా ఇవ్వటానికి నందమూరి బాలకృష్ణ శ్రీకారం చుట్టారు.
ఈ కార్యక్రమంలో భాగంగా మంగళవారం తెలుగు సినీ స్టిల్ ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులకు హెల్త్ ఆర్గనైజింగ్ డైరెక్టర్ శ్రీమూర్తి మరియు నందమూరి బాలకృష్ణ కాస్ట్యూమర్ ఏబిఆర్ మోహన్‌రావు.. కరోనా వ్యాధి నివారణకు హోమియోపతి మరియు యాంటీ ఆక్సిడెంట్, మల్టీ విటమిన్, మల్టీ మినరల్స్ వంటి మందులను అందజేశారు.
ఈ సందర్భంగా తెలుగు సినీ స్టిల్ ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జి. శ్రీను మాట్లాడుతూ.. ‘ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ వారు ఇచ్చిన మందులు విధిగా మా సభ్యులందరు వాడి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను’.. అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ట్రెజరర్ ఏ. వీరభద్రరావు.