కరోనా ఎఫెక్ట్ – హైదరాబాద్ ఫిల్మ్ చాంబర్‌లో అత్యవసర సమావేశం

కరోనా ఎఫెక్ట్ - హైదరాబాద్ ఫిల్మ్ చాంబర్‌లో అత్యవసర సమావేశం ఏర్పాటు..

  • Published By: sekhar ,Published On : March 5, 2020 / 07:50 AM IST
కరోనా ఎఫెక్ట్ – హైదరాబాద్ ఫిల్మ్ చాంబర్‌లో అత్యవసర సమావేశం

Updated On : March 5, 2020 / 7:50 AM IST

కరోనా ఎఫెక్ట్ – హైదరాబాద్ ఫిల్మ్ చాంబర్‌లో అత్యవసర సమావేశం ఏర్పాటు..

కరోనా ప్రభావం తెలుగు సినిమా పరిశ్రమపై పడింది. సినిమా షూటింగులు, థియేటర్లు మూతపడడం వంటి తదితర అంశాలను చర్చించడానికి తెలుగు సినీ ప్రముఖులు గురువారం సాయంత్రం హైదరాబాద్ ఫిల్మ్ చాంబర్‌లో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయనున్నారు.ఇప్పుడు ఎక్కడ విన్నా, ఎక్కడ చూసినా కరోనా వైరస్‌(కోవిడ్ -19)ను గురించిన వార్తలే.. ఎప్పుడు ఏం జరుగుతుందా.. ఈ మహమ్మారి గురించి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు నమోదు కావడంతో ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. కరోనా అనుమానితులతో ఆసుపత్రులు నిండిపోయాయి.

ఈ సందర్భంగా ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రభుత్వం కార్యచరణ సిద్ధం చేస్తోంది. ప్రముఖుల చేత ప్రచారం చేపట్టాలని నిర్ణయించింది. సెలబ్రిటీలు సైతం మాస్కులు ధరించే బయటకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఫిల్మ్ చాంబర్‌లో తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు, మా అసోసియేషన్ మెంబర్స్ అత్యవసర మీటింగ్ ఏర్పాటు చేశారు.(కరోనా వైరస్ – భయపడకండి.. జాగ్రత్తగా ఉండండి.. సెలబ్రిటీల సూచనలు..)

షూటింగులు, థియేటర్లు మూసేయ్యడం, షూటింగ్ లొకేషన్లలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి పలు అంశాలపై చర్చ జరుగనున్నట్టు సమాచారం. కరోనా కారణంగా ఇప్పటికే పలు షూటింగులు వాయిదా పడ్డాయి. జనాలు ఎక్కువగా వచ్చేది సినిమా థియేటర్లకే కాబట్టి వైరస్ సోకే అవకాశం ఎక్కువగా ఉంటుందని కొద్దిరోజుల పాటు థియేటర్లు మూతపడే అవకాశం ఉందని తెలుస్తోంది.