అవెంజర్స్‌లో బాలయ్య డైలాగులు
అవెంజర్స్ : ఎండ్ గేమ్‌లో ఎవెంజర్స్ అందరూ తెలుగు సినిమా డైలాగ్స్ చెప్పి ఆడియన్స్‌ని ఆకట్టుకుంటున్నారు..

అవెంజర్స్ : ఎండ్ గేమ్‌లో ఎవెంజర్స్ అందరూ తెలుగు సినిమా డైలాగ్స్ చెప్పి ఆడియన్స్‌ని ఆకట్టుకుంటున్నారు..
ప్రపంచ సినీ ప్రేమికులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అవెంజర్స్ : ఎండ్ గేమ్ ఈ నెల 26న వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది.ఇంగ్లీష్‌తో పాటు హిందీ, తెలుగు, తమిళ భాషల్లోనూ అవెంజర్స్ : ఎండ్ గేమ్ మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అన్ని థియేటర్ల బయట హౌస్ ఫుల్ బోర్డ్స్ కనబడుతున్నాయి.
సూపర్ హీరోలందరినీ ఒకే మూవీలో చూడడం, ఈ సిరీస్‌లో ఇదే చివరి సినిమా కావడంతో ఆడియన్స్‌లో మరింత ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యింది. తెలుగు వెర్షన్‌ని అత్యధిక థియేటర్స్‌లో రిలీజ్ చేసారు. తెలుగు వెర్షన్‌కి సూపర్బ్ రెస్పాన్స్ వస్తుంది. థానోస్ క్యారెక్టర్‌కి రానా డబ్బింగ్ చెప్పడం ప్లస్ అయ్యింది. ముఖ్యంగా తెలుగు ఆడియన్స్‌కి కనెక్ట్ అవడానికి సినిమాలో వాడిన పలు సినిమా డైలాగులు, సందర్భానికి తగ్గట్టు సినిమా సిచ్చుయేషన్‌ని పోలుస్తూ చెప్పిన డైలాగ్స్‌కి భీభత్సమైన స్పందన వస్తుంది.
సినిమాలో టైమ్ మెషీన్ గురించి చెప్పేటప్పుడు బాలకృష్ణ ‘ఆదిత్య 369’ సినిమాని గుర్తు తెచ్చేలా, ‘ఆదిత్య 24’ అని చెప్పడం, బాలయ్య కెరీర్‌లో పాపులర్ డైలాగ్ అయిన.. ‘నీ ఇంటికొచ్చా, నట్టింటికొచ్చా’.. ‘ప్లేస్ నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే’ వంటి డైలాగ్స్‌తో పాటు, ఫ్లాష్ బ్యాక్ చెప్పాల్సినప్పుడు.. ‘సింహా’ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ లాగా.. అని చెప్పించడంతో థియేటర్స్‌లో విజిల్స్ పడ్డాయి. ఇక ఎవెంజర్స్‌లో ఎవరు గొప్ప అనుకునే సీన్‌లో, ‘మన బ్యాచ్‌లో నేను బాహుబలి’ లాంటి ఎవెంజర్‌ని అని చెప్పడం, మణులకోసం లోయ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు.. గోపిచంద్ ‘సాహసం’ మూవీతో పాటు, మరికొన్ని పాత తెలుగు సినిమాలు గుర్తు చెయ్యడం తెలుగు ప్రేక్షకులకు సర్ ప్రైజింగ్‌గా అనిపించింది. ఎవెంజర్స్ అందరూ తెలుగు సినిమా డైలాగ్స్ చెప్పి ఆడియన్స్‌ని ఆకట్టుకుంటున్నారు.
వాచ్ అవెంజర్స్ ఎండ్ గేమ్ తెలుగు ట్రైలర్..