Hindi Dubbing: హిందీలో తెలుగు సినిమాలు.. జెండా పాతేస్తున్న మన హీరోలు!

తెలుగు సినిమా రేంజ్ మారిపోయింది. ఒకప్పుడు తెలుగు వాళ్లని పెద్దగా పట్టించుకోని బాలీవుడ్.. ఇప్పుడు తెలుగు సినిమాలపై పనిగట్టుకుని మాట్లాడుతోంది. మరి మనవాళ్లు హిందీలో జెండా పాతి..

Hindi Dubbing

Hindi Dubbing: తెలుగు సినిమా రేంజ్ మారిపోయింది. ఒకప్పుడు తెలుగు వాళ్లని పెద్దగా పట్టించుకోని బాలీవుడ్.. ఇప్పుడు తెలుగు సినిమాలపై పనిగట్టుకుని మాట్లాడుతోంది. మరి మనవాళ్లు హిందీలో జెండా పాతి ఏ విషయంలోనూ తగ్గేదేలే అంటున్నారు. అందుకే అక్కడ క్రేజ్ ని క్యాష్ చేస్కోడానికి టాలీవుడ్ స్టార్లు.. తమ సినిమాల్ని హిందీలో రిలీజ్ చెయ్యడానికి రెడీ అవుతున్నారు.

Tollywood Actress: ముంబైలో తెగ సందడి చేస్తున్న టాలీవుడ్ హీరోయిన్స్!

బాహుబలి ఇండియన్ సినిమాకి తెలుగు స్టామినా చూపిస్తే.. పుష్ప మూవీ తెలుగు హీరోల కలెక్షన్ల సత్తా చూపించింది. పుష్ప బాలీవుడ్ లో సాధించిన 100కోట్ల కలెక్షన్లతో ఒక్క సారిగా హిందీ ఇండస్ట్రీ మొత్తం తెలుగు సినిమాల వైపు చూస్తోంది. పుష్పని ఫస్ట్ ఓన్లీ సౌత్ లాంగ్వేజెస్ లో రిలీజ్ చెయ్యాలనుకున్నా.. తర్వాత హిందీలో రిలీజ్ అయ్యిఅక్కడ రికార్డులు తిరగరాసింది పుష్ప.

Tollywood Star’s: హైప్ ఉన్నప్పుడే హైని చూసేయాలి.. ఇదే ఇప్పుడు ట్రెండ్!

ఈ రేంజ్ లో తెలుగు సినిమాలకున్న ఈ క్రేజ్ ని బాలీవుడ్ లో కంటిన్యూ చెయ్యాలనుకుంటున్నారు మన హీరోలు. అందుకే తమ సినిమాల్ని బాలీవుడ్ లో రిలీజ్ చేస్తున్నారు. రీసెంట్ గా రవితేజ తన ఖిలాడి సినిమాని హిందీలో రిలీజ్ చేశారు. లేటెస్ట్ గా ఆచార్య కూడా ఈ లిస్ట్ లోకే వచ్చాడు.

Tollywood Stars: ఏడ్చి.. ఏడిపించేసి.. టాలీవుడ్ స్టార్స్ ఎమోషనల్ టచ్!

చిరంజీవి, రామ్ చరణ్ లీడ్ రోల్స్ లో కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కిన ఆచార్య సినిమా రీజనల్ గానే ఓన్లీ తెలుగులో రిలీజ్ చెయ్యడానికే ఫస్ట్ నుంచి ప్లాన్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు బాలీవుడ్ లో తెలుగు సినిమాల క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని ఆచార్యను కూడా హిందీలో రిలీజ్ చేస్తున్నారు. రామ్ చరణ్ కి హిందీలో మంచి క్రేజ్ ఉండడంతో పెన్ స్టూడియోస్ ఈ సినిమా హిందీలో డబ్ చేసి గ్రాండ్ గా ఏప్రిల్ 29న రిలీజ్ చేస్తున్నారు.

Tollywood Hero’s: కలిసి వస్తున్న తండ్రి కొడుకులు.. ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా!

అసలు బాలీవుడ్ వైపు ఎప్పుడూకన్నెత్తి చూడని, పన్నెత్తి మాట్లాడని పవన్ కళ్యాణ్.. భీమ్లానాయక్ సినిమా కూడా హిందీలో రిలీజ్ కాబోతోంది. అవుట్ అండ్ అవుట్ సౌత్ కమర్షియల్ మసాలా ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన భీమ్లానాయక్.. మొన్నటి వరకూ అసలు హిందీ రిలీజ్ అన్న ఊసే ఎత్త లేదు. కానీ రిలీజ్ టైమ్ వచ్చేసరికి సడెన్ గా భీమ్లానాయక్ బాలీవుడ్ లో గ్రాండ్ గా రిలీజ్ అవుతోందంటూ అనౌన్స్ చేశారు మేకర్స్. భీమ్లా నాయక్ పవర్ స్టార్మ్ పర్ ఫామెన్స్ బాలీవుడ్ ఆడియన్స్ ని బాగాఆకట్టుకుంటుందని ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు టీమ్. ఇలా మన లోకల్ స్టార్లు.. బాలీవుడ్ లో జెండా పాతడానికి రెడీ అవుతున్నారు.